Krishna: టాలీవుడ్ లో హీరోగా, నిర్మాతగా ఎన్నో సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు అందించారు. ఆయన ఇప్పుడు మన మధ్యలో లేకున్నా.. సినిమా అనేది ఉన్నంతకాలం ఆయన ప్రతి ప్రేక్షకుడి గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోతారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ లకు ధీటుగా నిలిచి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. అలాగే సినీ ఇండస్ట్రీలో తన సినిమాలు తాను చేసుకుంటూ.. నలుగురికి సాయపడేలా ఉన్నారు తప్ప సూపర్ స్టార్ కృష్ణ మరే వివాదాలకు పాల్పడలేదు. ఎంతో ఎత్తుకు ఎదిగిన ఏకైక స్టార్ హీరోగా కృష్ణ తన ఇమేజ్ ను పెంచుకున్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణకు ఇద్దరు భార్యలు అనే సంగతి అందరికీ తెలుసు.
ఇందిరాదేవి, మరొకరు విజయనిర్మల. ఇక సూపర్ స్టార్ కృష్టకు ఫస్ట్ భార్యకు పుట్టిన పిల్లల్లో మొదటి సంతానం పద్మావతికి ప్రముఖ వ్యాపారవేత్త.. తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కు పెళ్లి అయ్యింది. వీరిద్దరికీ 1991 లో చెన్నైలో పెళ్లి జరిగింది. ఆ టైమ్ లో తమిళనాడు సీఎంగా జయలలిత ఉన్నారు. ఆమె హీరోయిన్ గా కూడా యాక్ట్ చేశారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి కూడా కావడంతో తన కూతురి పెళ్లికి రావాలని జయలలితకు ఆహ్వానం పంపించారట. అలాగే ఈ వివాహానికి ఎంతోమంది బిజినెస్ మెన్, సినీ ప్రముఖులు కూడా వచ్చారు. అలాగే ఈ పెళ్లికి జయలలిత కూడా రావాలని అనుకున్నారట.
సీఎంగా జయలలిత ఉన్న తనకు విపరీతమైన సెక్యురిటీ ఉంది. అలాంటప్పుడు వారే పెళ్లి మండపంలో ఆమె సెక్యురిటీ వచ్చి.. మండపం ముందు వరుసలో ఉన్నవాళ్లందర్ని ఖాళీ చేయించారట. ఎంతోమంది ప్రముఖులను సైతం సీఎం సెక్యురిటీ అవమానించిందట. అందుకే ఇదంతా చూసిన సూపర్ స్టార్ కృష్ణ సెక్యురిటీ బాధ.. ఇదంతా ఎందుకు.. మళ్లీ మిగతా వాళ్లు బాధపడుతున్నారని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంంటే.. తన కూతురి పెళ్లికి జయలలితను రావద్దని కోరారు. ఆ విషయం అర్థం చేసుకున్న జయలలిత కూడా తన అనుచరులతో పెళ్లికి, పెళ్లి కూతురికి కానుకలు పంపారట. అలా సీఎంకు ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని సూపర్ స్టార్ కృష్ణ చెప్పారని వార్తలు రాశారు.