NTR Family: స్వర్గీయ నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి (Kantamaneni Uma Maheswari) ఆగస్టు 1 ఉదయం కన్నుమూశారు. నందమూరి కుటుంబానికి ఆగస్టు నెల అనేది అచ్చి రాలేదనే వార్తలు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి.
హరికృష్ణ 2018 ఆగస్టు 29న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఆగస్టు నెల సంక్షోభం గురించి పార్టీ శ్రేణులందరికీ తెలిసిందే. ఇదే ఆగస్టు నెలలో ఎన్టీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రిని కోల్పోయారు.
ఇప్పుడు కుమార్తె కూడా ఆగస్టు నెలలోనే మరణించడంతో నందమూరి అభిమానులు, టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఉమా మహేశ్వరి పెద్ద కుమార్తె అమెరికా నుండి రావాల్సి ఉంది. ఆగస్టు 3 (బుధవారం) ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారని తెలుస్తోంది.
![](https://www.filmylooks.com/wp-content/uploads/2022/08/Nandamuri-Harikrishna.jpg)
![](https://www.filmylooks.com/wp-content/uploads/2022/08/Uma-Maheswari-1.jpg)
Leave a comment