Director: కొందరు దర్శకులు సినిమాని ప్రాణంగా ప్రేమిస్తారు. తాము కావాలనుకున్న ఔట్పుట్ వచ్చేంత వరకు కష్టపడుతూనే ఉంటారు. ఈ క్రమంలో తన అసిస్టెంట్స్, నటులపై కూడా చేయి చేసుకుంటారు. దర్శకులు నటీనటులపై చేయి చేసుకోవడం వంటి విషయాలు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విన్నాం. దర్శకుడు తేజ్.. ఉదయ్ కిరణ్ లాంటి వారితో కూడా నటన రాబట్టేందుకు చేయి చేసుకున్నాడని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే తేజ అంటే నటీనటులకి హడల్. తమిళంలోను అలాంటి దర్శకుడు ఒకరు ఉన్నారు. అతని పేరు మారీ సెల్వరాజ్. ఇటీవల ధనుష్‌తో కర్ణన్ అనే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న అతను ఇప్పుడు ఉదయనిధి, ఫాహద్ ఫాజిల్‌తో మామన్నన్ సినిమా చేశారు. ఈ చిత్రం జూన్ 29 ప్రేక్షకుల ముందుకు రానుంది.
మారీ సెల్వరాజ్ తనకి కోపం వచ్చినప్పుడల్లా చిత్రంలో పని చేసే నటులు, అసిస్టెంట్ డైరెక్టర్లపై చెయ్యి చేసుకుంటారని చాలా సార్లు వార్తలు వచ్చాయి. మారీకి కోపం వస్తే సెట్ అంతా భీబత్సంగా మారుతుందని, ఆయన తన అసిస్టెంట్స్ పై కూడా దాడి చేస్తాడని కొందరు చెప్పుకొచ్చారు. అయితే ఇదే విషయాన్ని తాజాగా ప్రముఖ హీరో ఉదయనిధి స్టాలిన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెపుకొచ్చారు. మారీకి కోపం వస్తే అసిస్టెంట్లను చావగొడతాన్నది నిజం అని ఉదయనిధి అన్నారు. మూవీ చిత్రీకరణ సమయంలో చాలా టెన్షన్ పడ్డది డైరెక్టర్ సారే.
మారీ సార్ అందర్నీ కొట్టేవాడు. అసిస్టెంట్ డైరెక్టర్లందర్నీకూడా కొట్టేవాడు. అతను కొడుతుంటే వాళ్లు గట్టిగట్టిగా అరిచే వాళ్లు. అసిస్టెంట్స్ ఒకవైపు, కెమెరా మ్యాన్ మరోవైపు ఆయన దెబ్బలకు తట్టుకోలేక అరిచేవాళ్లు అని ఉదయనిథి స్టాలిన్ చెప్పుకొచ్చాడు. మరో వీడియోలో మారీ సెల్వరాజ్ నన్ను కూడా కొట్టారు.ఓ సీన్లో కాఫీ తాగినట్టు నటించమని చెప్పారు. అది చేయలేకపోయా. హీరో సీన్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు డైలాగ్ చెప్పమన్నారు. అది మరచిపోయా. అప్పుడు నా చెంప మీద కొట్టారు మారీ సెల్వరాజ్. అప్పుడు ఏడ్చుకుంటూ నేను చేయనని చెప్పాను. అప్పుడు బ్రతిమిలాడి నన్ను నటించేలా చేశారు. మొత్తానికి దర్శకుడికి సంబంధించిన ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.