నటరత్న నందమూరి తారక రామారావు గురించి ఎన్నిసార్లు ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఈనాడు ఇలా ఉంది అంటే దానికి ప్రధాన కారణం నటరత్న ఎన్టీఆర్. ఆయన తర్వాత చిత్ర పరిశ్రమకు ఆయన వారసులుగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన నటసింహం నందమూరి బాలకృష్ణ ముందుగా తన తండ్రి తన అన్నతో కలిసి తాతమ్మ కళా సినిమాతో తెలుగులో బాల నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తన తండ్రితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించి తండ్రికి తగ్గ నటుడుగా అనిపించుకున్నాడు.
అదే సమయంలో సీనియర్ దర్శకుడు కోడీ రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మంగమ్మగారి మనవడు సినిమాతో సోలో హీరోగా తొలి ఇండస్ట్రీ హీట్ అందుకున్నాడు. అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోకుండా వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలనే వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోల్లో బాలకృష్ణ ఒకరు.. ఇప్పటికే అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్న బాలకృష్ణ..తన సినిమాలతోనే కాకుండా బుల్లితెరపై కూడా ఎవరు ఊహించని రీతిలో అదరగొడుతున్నాడు.
ఇప్పటికే ఆహాలో వచ్చిన అన్ స్టాపబుల్ షో తో తనలోని కొత్త బాలకృష్ణను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇదే సమయంలో ఎవరికీ తెలియని ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..బాలకృష్ణకు ‘బాలయ్య’ అనే పేరు ఎలా వచ్చింది. బాలకృష్ణను అందరూ ముద్దుగా బాలయ్య అని పిలుస్తూ ఉంటారు. అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమలో ఉన్న వారందరూ కూడా బాలయ్య అని పిలుస్తూ ఉంటారు. ఇదే సమయంలో అసలు బాలకృష్ణకు బాలయ్య అనే పేరు ఎలా వచ్చింది అనేది ఎవరికీ పెద్దగా తెలియదు. ఇక ఈ పేరు వెనక ఎవరికి తెలియని ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది.
బాలకృష్ణ సీనియర్ దర్శకుడు బి.గోపాల్ కాంబోలో ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన లారీ డ్రైవర్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్ అయింది. 1990లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బాలయ్యకు అదిరిపోయే బంపర్ హిట్ ని ఇచ్చింది. ఆదే సమయంలో ఈ సినిమాలోని పాటలు ప్రముఖ రచయిత జొన్నవిత్తుల, సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు.
అదే క్రమంలో ఈ సినిమా దర్శకుడు బి.గోపాల్ మీరు ఏ పాటైనా రాయండి ఇందులో ఒక పాటలో ‘బాలయ్య.. బాలయ్య’ అన్నీ ఉండాలని అంటూ ఖచ్చితంగా చెప్పారు. ఇక దాంతో రచయిత జొన్నవిత్తుల ‘బాలయ్య బాలయ్య గుండెల గోలయ్య’ అనే పాటను రాశారు. ఆ పాట సినిమాతో పాటుగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పటినుంచి బాలకృష్ణను ‘బాలయ్య’ అంటూ పిలవడం మొదలుపెట్టారు. ఈ విధంగా బి. గోపాల్ రాపిచ్చుకున్న పాట ద్వారా బాలకృష్ణకు ‘బాలయ్య’ అనే పేరు వచ్చింది.