మన తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య అంటే పడి చచ్చే అభిమానులు లక్షల్లో ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పల్లెటూరులో ఎక్కడైనా బాలయ్య సినిమా షూటింగ్ జరిగిందంటే చాలు అక్కడికి ప్రజలు వేలదిగా ఎగబడి షూటింగ్‌లకు వెళ్తారు. గతంలో పల్లెటూర్లో షూటింగ్ అంటే ఆహ్లాదంగా సందడి వాతావరణంగా ఉండేది. ఇక మరి అందులోనూ బాలయ్య ఇలాంటి స్టార్ హీరో సినిమా షూటింగ్ జరుగుతుందంటే చుట్టుపక్కల కనీసం 20 గ్రామాల్లో ఈ సందడి వాతావరణం ఉంటుంది.
ఆ 20 గ్రామాల ప్రజలు తండోపతండాలుగా ఆ షూటింగ్ కు వెళ్లి బాలయ్య ను చూసి ఆనందిస్తారు. 20 సంవత్సరాల క్రితం బాలయ్య నటించిన ఓ సినిమా షూటింగ్ గుంటూరు జిల్లాలో జరిగింది. అయితే ఆ షూటింగ్లో బాలయ్యను చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వచ్చారు.. దాంతో గుంటూరు జిల్లాలోని పలు ఆర్టీసీ డిపోల నుంచి స్పెషల్ బస్సులు వేసి మరి బాలయ్య షూటింగ్ కు అభిమానులను తీసుకువెళ్ళింది.
ఆ సినిమా మరేదో కాదు బాలకృష్ణ- బి. గోపాల్ కాంబినేషన్లో వచ్చిన పల్నాటి బ్రహ్మనాయుడు.. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా చిత్రీకరించారు. ముఖ్యంగా కోటప్పకొండ, సత్రశాల, కారంచేడు, మాచర్లలో ఈ సినిమా షూటింగ్ నెలరోజుల పాటు జరిగింది. చాలా మంది ప్రజలు ఈ షూటింగ్‌ను, బాలయ్యాను చూసేందుకు తరలివచ్చారు భారీ జన సందోహం మధ్య పలనాడు ప్రాంతంలో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు.
ఈ షూటింగ్ చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా నరసారావు పేట నుంచి కోటప్పకొండకు, మాచర్ల, రెంటచింతల, పిడుగురాళ్ల డిపోల నుంచి సత్రశాల కారంచేడుకీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించింది. అంచనాలకు మించి అభిమానులు బాలయ్య షూటింగ్ చూసేందుకు వెళ్లినా కూడా ఆటంకం లేకుండా ఈ సినిమా షూటింగ్ జరగటం పెద్ద విశేషం.. అప్పట్లో బాలయ్య పలనాటి బ్రహ్మనాయుడు షూటింగ్ ఓ సంచలనంగా నిలిచింది.