బాలకృష్ణ- భూమిక కాంబినేషన్లో మిస్ అయిన సూపర్ హిట్ సినిమా ఏమిటో తెలుసా..! - Filmylooks
Home Film News బాలకృష్ణ- భూమిక కాంబినేషన్లో మిస్ అయిన సూపర్ హిట్ సినిమా ఏమిటో తెలుసా..!
Film News

బాలకృష్ణ- భూమిక కాంబినేషన్లో మిస్ అయిన సూపర్ హిట్ సినిమా ఏమిటో తెలుసా..!

ఇక మన చిత్ర పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి హిట్ కొట్టడం ఎంతో కామన్ గా జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని అరుదైన కాంబినేషన్లు కూడా మిస్ అవుతూ ఉంటాయి.. ఉదాహరణకు పవన్ కళ్యాణ్- నయనతార, పవన్- అనుష్క కాంబినేషన్లో సినిమాలు ఇప్పటికీ రాలేదు. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. వారు ఆశలు మాత్రం నెరవేరటం లేదు.

Nandamuri Balakrishna: బాలయ్య మార్కెట్ ఇంతగా పెరగడానికి కారణం ఏంటో  తెలుసా..? - Telugu News | Do you know the reason why Balakrishna market has  increased so much | TV9 Telugu

ఇక నందమూరి బాలకృష్ణ- భూమిక కాంబినేషన్లో ఓ సూపర్ హిట్ సినిమా మిస్సయింది. బాలయ్య ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పి ఉంటే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ పోస్టర్ హిట్ సినిమాగా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు సింహాద్రి.. దర్శక దీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా 2003లో ప్రేక్షకుల‌ ముందుకు వచ్చిన సింహాద్రి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసింది.

Will Balakrishna Give a Break for Bhumika Chawla?

ఇక సినిమా కథ ముందుగా రెడీ చేసిన రచయిత విజయేంద్ర ప్రసాద్ ముందుగా బాలకృష్ణకు చెప్పారట. బాలయ్య హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా చేయాలని అనుకున్నారు. అప్పటికే బాలయ్య చాలా ఫ్యాక్షన్ కథ‌లతో సినిమాలు చేసి ఉండటం.. అదే టైంలో బి.గోపాల్ దర్శకత్వంలో పలనాటి బ్రహ్మనాయుడు లాంటి ఫ్యాక్షన్‌ సినిమాలో నటిస్తూ ఉండటంతో మళ్ళీ వెంటనే మరో ఫ్యాక్షన్ సినిమా చేస్తే బాగోదేమో అని నో చెప్పారట. ఈ సినిమాలో అప్పటికి హీరోయిన్‌గా భూమికను తీసుకోవాలని రాజమౌళి ఫిక్స్ అయ్యారు.

SImhadri Telugu Full Movie | Mana Chitraalu - YouTube

బాలయ్య- భూమిక కాంబినేషన్ అయితే బాగుంటుందని కూడా ఆయన అనుకున్నారు. ఎప్పుడైతే బాల‌య్య నో చెప్పారో అదే కథ‌తో ఎన్టీఆర్ హీరోగా సింహాద్రి సినిమా తీసి బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్నాడు. సింహాద్రిలో మరో హీరోయిన్‌గా అంకిత నటించారు. అయితే అంకిత- భూమిక బాలయ్యతో కలిసి నటించారు.. బాలయ్య హీరోగా వచ్చిన విజయేంద్ర వర్మ సినిమాలో అంకిత హీరోయిన్‌గా నటించగా.. ఇక చాలా ఏళ్లు తర్వాత బాలయ్య రూలర్ సినిమాలో భూమిక‌ నటించింది. అయితే బాలయ్య సినిమాలో భూమిక హీరోయిన్గా కాదు.. సినిమాకు మలుపు తిప్పే కీలకపాత్రలో ఆమె నటించింది. ఈ విధంగా బాలయ్య భూమిక కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమా మిస్ అయింది అని చెప్పాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...