ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఓ సినిమా ధియేటర్లో ఎంత హిట్ అయినా ఆ సినిమా పట్టుమని రెండు వారాలు కూడా థియేటర్లో ఆడటం లేదు. అయితే ఇక్కడ బాలకృష్ణ నటించిన గత మూడు సినిమాలు ధియేటర్లో బంపర్ హిట్ కొట్టడంతో పాటు 50- 100- 150- 175 రోజులు సులువుగా ఆడేస్తున్నాయి. అఖండ 100 రోజులకు పైగా 50 కేంద్రాల్లో ఆడటంతో పాటు ఒక థియేటర్లో 200 రోజులు కూడా ఆడింది. అలాగే ఈ సినిమా తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి కూడా ఒక్క థియేటర్లో 175 రోజులు ఆడింది.
ఇక ఇప్పుడు వచ్చిన భగవంత్ కేసరి సినిమా కూడా బంపర్ హిట్గా నిలిచింది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భగవంత్ కేసరి థియేటర్లో కూడా సూపర్ హిట్ అయింది.. అటు అమెజాన్ ప్రైమ్ లో వచ్చి అక్కడ కూడా అదరగోడుతున్నాడు బాలయ్య.. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. భగవంత్ కేసరి మొత్తంగా 15 సెంటర్లో 50 రోజులు ఆడితే అందులో 11 డైరెక్ట్ సెంటర్లు, మరో 4 షిఫ్టింగ్ కేంద్రాలు ఉన్నాయి.
మదనపల్లి – హిందూపురం – ధర్మవరం – తాడిపత్రి – కర్నూలు – నంద్యాల – ఆళ్లగడ్డ – జమ్మలమడుగు – చిలకలూరిపేట – ఏలూరు – గాజువాకలో డైరెక్టుగానే 50 రోజులు ఆడిన భగవంత్ కేసరి.. గుంతకల్లు, అనంతపురం, ఎమ్మిగనూరు, ఖమ్మంలో షిఫ్ట్లతో 50 రోజులు ఆడింది. ఈ 15 కేంద్రాల్లు కూడా బాలయ్యకు కంచుకోట అయిన రాయలసీమలోనే ఎక్కువ కేంద్రాలు ఉన్నాయి.
ఉత్తరాంధ్ర నుంచి వైజాగ్, గాజువాక, ఏలూరు, ఆ తర్వాత చిలకలూరిపేట ఉన్నాయి. ఇక తెలంగాణ మొత్తం మీద ఒక్క ఖమ్మంలో మాత్రమే 50 రోజులు ఆడింది. మిగిలిన కేంద్రాలు అన్నీ కూడా సీడెడ్లోనే ఉన్నాయి. ఇక భగవంత్ కేసరి సీడెడ్లోనే కొన్ని చోట్ల 100 కేంద్రాలు ఆడుతుంది. ఇక ఏదేమైనా మరోసారి సీడెడ్ బాలయ్య తన కంచుకోట అని ఫ్రూవ్ చేసుకున్నాడు.