Mokshagna: టాలీవుడ్లో ఇప్పటికే పెద్ద హీరోల తనయులు సత్తా చాటుతుండగా, బాలయ్య తనయుడు మాత్రం ఇంకా వెండితెర డెబ్యూ ఇవ్వలేదు. దీంతో నందమూరి ఫ్యాన్స్ నిరుత్సాహంలో ఉన్నారు. మోక్షజ్ఞ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఏ దర్శకుడి డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడు, ఎలాంటి కథతో సినిమా చేస్తాడు అని కొన్నాళ్లుగా అనేక చర్చలు నడుస్తున్నాయి. గతకొంత కాలంగా వీటిపై చర్చలు నడుస్తున్నాయే తప్ప పక్కా క్లారిటీ అయితే రావడం లేదు. బాలయ్యని మీడియావారు మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి ప్రశ్నలు వేయగా, ఆయన కూడా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. అయితే తానా సభల్లో పాల్గొనడానికి వెళ్లిన బాలయ్య తన తనయుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు
తన కుమారుడిని వచ్చే ఏడాది పరిచయం చేయనున్నట్లు చెప్పుకొచ్చిన బాలయ్య, ఏ సినిమాతో ఎంట్రీ ఉంటుందనేది కూడా చెప్పేశారు. తన కుమారుడు మోక్షజ్ఞ తేజ ని ఆదిత్య 369 సీక్వెల్ తో పరిచయం చేస్తానని చెప్పిన ఆయన ఈ చిత్రానికి సంబంధించిన పనులు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అనంతరం మొదలవుతాయని స్పష్టం చేశారు. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషించనుండగా, మోక్షజ్ఞ కీలక పాత్రలో మెరవనున్నట్టు టాక్. మోక్షజ్ఞను బోయపాటి శ్రీను లాంచ్ చేయనున్నారంటూ జరుగుతున్న ప్రచారాలపై కూడా బాలయ్య స్పందించారు.
అది అంతా దైవేచ్ఛఅంటూ ఆయన నవ్వి ఊరుకున్నారు. ప్రస్తుతం బాలయ్య తనయుడు మోక్షజ్ఞ అమెరికా లో యాక్షన్ కోర్స్ చేస్తున్నాడు. ఇటీవల పలు ఈవెంట్స్‌లో మోక్షజ్ఞ బొద్దుగా కనిపించడంపై ఆయన హీరోగా సెట్ అవుతాడా? అనే కామెంట్స్ కూడా నెటిజన్ల లో వ్యక్తం అయ్యాయి.. పైగా ఇండస్ట్రీలో బాలయ్య లెగసీని కొనసాగించాలంటే ఇలా ఉంటే సరిపోదు కదా, అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కాని రీసెంట్గా ఊహించని బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో కూడిన స్లిమ్ లుక్‌లో కనిపించి అందరికి పెద్ద షాక్ ఇచ్చాడు. మోక్షజ్ఞ న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు.తండ్రిని తనయుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.