Pawan Movies: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలపై పూర్తి దృష్టి పెట్టిన జనసేనాని వచ్చే ఎన్నికలలో చక్రం తిప్పాలని అనుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు. మరో వైపు పవన్ కళ్యాణ్ చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నట్టు తెలుస్తుండగా, ఆ చిత్ర షూటింగ్స్ త్వరగా పూర్తి చేసి ఆ మూవీలన్నింటిని ఈ ఏడాదే విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారట పవన్ కళ్యాణ్.మొన్నటి వరకు ఎలక్షన్స్‌కి ముందు బ్రో సినిమానే చివరిది అని వార్తలు వచ్చాయి. . ఉస్తాద్, వీరమల్లు, ఓజి చిత్రాలని ఎలక్షన్స్ తర్వాతే విడుదల చేయబోతున్నారని అన్నారు. కాని అంతలోనే ట్విస్ట్ ఇచ్చారు.
బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఆలోచన పూర్తిగా మారినట్టు తెలుస్తుంది. ఎలక్షన్స్ వరకు సినిమా షూటింగ్స్ చేయోద్దనుకున్న పవర్ స్టార్.. ఇప్పుడు సడెన్‌గా ఉస్తాద్ భగత్ సింగ్‌ను మొదలుపెట్టాలని చూస్తున్నారు గతవారం హరీష్ శంకర్ మంగళగిరి వెళ్లి పార్టీ ఆఫీస్‌లోనే పవన్‌ను కలిసారు. ఇద్దరి మధ్య పలు చర్చలు నడిచాయి. అంతా బాగుంటే ఆగస్ట్ 15 నుంచి ఉస్తాద్ నాన్ స్టాప్ షెడ్యూల్ మొదలు కానున్నట్టు సమాచారం. బ్రో మాదిరిగానే రికార్డ్ టైమ్‌లో ఉస్తాద్ పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారట. ఈ క్రమంలో హరీష్ శంకర్ పక్కా ప్లానింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని పవన్ కళ్యాణ్.. పొలిటికల్ వెపన్‌గా వాడుకోవాలని అనుకుంటున్నారట. ఈ చిత్రంలో వినోదంతో పాటు.. పొలిటికల్ సెటైర్లు కూడా ఉండనున్నాయని తెలుస్తుంది. ఆగస్టు నుంచి స్టార్ట్ చేసి.. డిసెంబర్‌లోపు చిత్ర షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి మూవీ రిలీజ్ చేయాలనే ప్లాన్‌తో ఉన్నారు మేకర్స్. ఇక పవన్ నటిస్తున్న మరో చిత్రం ఓజీ 40 రోజులలో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. ఈ చిత్ర షూటింగ్ సెప్టెంబర్‌లో పూర్తి చేయాలని అనుకుంటున్నారట. మరోవైపు వీరమల్లు కూడా పూర్తి చేయాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తుంది.ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగితే పవన్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా వర్కవుట్ అవుతుంది, ముందస్తు ఎలక్షన్స్ వస్తే మాత్రం ఆయన డైలమాలో పడడం ఖాయం.