Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీతో బాక్సాఫీస్ బరిలో సందడి చేస్తున్నాడు. గతకొద్ది రోజులుగా థియేటర్లకు రావడానికి సరిగ్గా ఆసక్తి చూపని ప్రేక్షకులను.. మంచి కంటెంట్ ఉన్న మూవీ తీస్తే ఎందుకు హాళ్లకు రారని ప్రశ్నించి మరీ రప్పిస్తున్నాడు. సరైన సినిమా పడితే ఆ హంగామా ఎలా ఉంటుందో బింబిసారుడు చూపిస్తున్నాడు.
ఇంటర్వూల్లో సినిమా గురించి టీమ్ చాలా డీటేయిల్డ్గా చెప్పారు. కానీ, ఎవరూ ఊహించని ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో. థియేటర్లో ఫ్యాన్స్, ఆడియన్స్ షాక్తో కూడిన సర్ప్రైజ్కి గురవుతున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా అని డిక్లేర్ చేసేశారు. ఈ శుక్రవారం (ఆగస్ట 5) వరల్డ్ వైడ్ గ్రాండ్గా రిలీజ్ అయ్యింది.
హైలెట్ ఏంటంటే.. మార్నింగ్ షోకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో.. ఆంధ్ర, తెలంగాణలో థియేటర్లు పెంచారు. ఫస్ట్ డేనే బిజినెస్ జరిగిన దాంట్లో సగం రికవరీ చేసేశాడు. ట్రేడ్ వర్గాల వారి లెక్కల ప్రకారం.. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అక్షరాలా ఆరు కోట్లకు (6.3 కోట్లు) పైగా షేర్ రాబట్టాడు. ఓవర్సీస్ మరియు రెస్టాఫ్ ఇండియా కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది.
శని, ఆదివారాలు వీకెండ్ కాబట్టి కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశం పుష్పలంగా ఉంది. గత రెండు నెలలుగా తెలుగులో మేజర్, డబ్బింగ్ బొమ్మ విక్రమ్ మినహా ఏవీ ప్రేక్షకులను అలరించలేదు. సాలిడ్ సినిమా పడితే తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారని మరోసారి కళ్యాణ్ రామ్, తెలుగు ప్రేక్షకులు ప్రూవ్ చేశారు. ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్నిచ్చాడు బింబిసారుడు.
Leave a comment