Bimbisara Release Trailer: నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ఫిలిం ‘బింబిసార’ ఆగస్టు 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. కొద్దిరోజుల నుండి టీం ప్రమెషన్స్ స్పీడప్ చేసింది.
ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో, కళ్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనుండడం, ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బింబిసార’ చూసి బ్లాక్ బస్టర్ అని చెప్పడంతో అంచనాలు రెట్టింపయ్యాయి.
బుధవారం సాయంత్రం అన్నయ్య సినిమా రిలీజ్ ట్రైలర్‌ని ఆన్ లైన్లో విడుదల చేసాడు తారక్.. ‘శరణు కోరితే ప్రాణ భిక్ష…ఎదిరిస్తే మరణం’ అంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది.
విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. కేథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. వశిష్ట దర్శకుడిగా, కళ్యాణ్ రామ్ బావమరిది కె.హరికృష్ణ నిర్మాతగా పరిచయమవుతున్నారు.
Leave a comment