బాలీవుడ్ ప్రతిష్టాత్మక 69వ ‘ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024 వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. 2023లో విడుదలైన సినిమాలకు సంబంధించిన అవార్డులను కూడా ఇక్కడ ప్రకటించారు. ఇక వాటిలో రణబీర్ కపూర్ నటించిన యానిమల్, విక్రాంత్ మాస్సే నటించిన 12 ఫెయిల్ సినిమాలు అవార్డులను దక్కించుకున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అలియా భట్ ఉత్తమ నటిగా (రాఖీ ఔర్ రాణి), రణబీర్ కపూర్ ఉత్తమ నటుడిగా ( యానిమల్ ) నిలిచారు.
12 th ఫెయిల్ మూవీ కూడా ఉత్తమ చిత్రం అవార్డును సొంతం చేసుకుంది. కరణ్ జోహార్, ఆయుష్మాన్ ఖురానా, మనీషా పాల్ ఈ వేడుకకు హోస్టులుగా వ్యవహరించారు. ఇక పలువురు సెలబ్రెటీలు ఈ అవార్డుల వేడుకకు హాజరయ్యారు. ఇంతకీ ఏ అవార్డు ఏ సినిమా సొంతం చేసుకుంది. ఏ అవార్డు ఏ సినిమాకు వచ్చింది అనే వివరాలు ఇక్కడ చూద్దం..
ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్
ఉత్తమ దర్శకుడు: విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): జొరామ్
ఉత్తమ నటుడు(క్రిటిక్స్): విక్రాంత్ మెస్సి(12th ఫెయిల్)
ఉత్తమ నటుడు: రణ్ బీర్ కపూర్ (యానిమల్)
ఉత్తమ నటి: అలియా భట్: (రాఖీ ఔర్ రాణి)
ఉత్తమ నటి(క్రిటిక్స్) రాఖీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ నార్వే), షెఫాలీ షా( త్రీ ఆఫ్ అజ్)
ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్ (డంకీ)
ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ(రాఖీ ఔర్ రాణి)
ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలియ-జవాన్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్ బాబల్ ( అర్జున్ వెయిలీ-యానిమల్)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్: యానిమల్
ఉత్తమ కథ: అమిత్ రాయ్(OMG 2)
ఉత్తమ స్క్రీన్ ప్లే: విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
ఉత్తమ డైలాగ్: ఇషితా మొయిత్రా(రాఖీ ఔర్ రాణి)
Star-studded inside pics from the 69th #HyundaiFilmfareAwards2024 with #GujaratTourism.https://t.co/wMdQ9HdKSK
— Filmfare (@filmfare) January 28, 2024