Home Film News BRO Movie Review: ‘బ్రో’ మూవీ రివ్యూ.. థియేటర్స్ ని షేక్ చేస్తున్న మెగా కాంబో
Film News

BRO Movie Review: ‘బ్రో’ మూవీ రివ్యూ.. థియేటర్స్ ని షేక్ చేస్తున్న మెగా కాంబో

BRO Movie Review: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ సినిమాలంటే ఓ రేంజ్ క్రేజ్ ఉంటుంది. ప్రజంట్ పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్స్ లో తన హవా చూపిస్తున్నారు. సాయిధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన బ్రో మూవీ నేడు రిలీజ్ అయ్యింది. మరి ఈ మూవీ తమిళంలో హిట్ అయిన వినోదాయ సీతం మూవీకి రీమేక్ కాగా, తెలుగులో బ్రో గా తెరకెక్కింది. ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

 

స్టోరీ : మార్కండేయులు (సాయి ధరమ్‌ తేజ్‌) చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో కుటుంబాన్ని హ్యాండిల్ చేస్తాడు. ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడిని చదివిస్తాడు. వాళ్లకి కావాల్సినవన్నీ సమకూరుస్తాడు.. గానీ వాళ్లకు ప్రేమను పంచే టైమ్ తన దగ్గర ఉండదు. ఎప్పుడూ బిజీ బిజీ లైఫ్ లో ఉంటాడు. అలాంటి మార్కండేయకు సడెన్ గా ఓ యాక్సిడెంట్ అవుతుంది. సరిగ్గా అప్పుడే అతనికి టైమ్ అదేనండి పవన్ కళ్యాణ్ ఎదురుపడి.. మార్కండేయకు 90 రోజుల పాటు తిరిగి జీవితాన్ని ఇస్తాడు. మరి ఆ టైమ్ లో ఏం చేస్తాడు.. 90 రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

నటీనటులు:
పవన్ కళ్యాణ్ ఇప్పటికే వెంకీతో కలిసి నటించిన గోపాల గోపాల మూవీలో దేవుడిగా కనిపించాడు. అలాగే ఈ బ్రో మూవీలో కూడా మంచి యాటిట్యూడ్ తో కంటిన్యూ అయ్యాడు. నిజంగా దేవుడు అంటే ఇలానే ఉంటాడా అనేది చూపించారు. మనలో చాలామంది అనుకుంటాం ఒక్కసారి టైమ్ తిరిగి వస్తే బావుండు అని.. ఈ మూవీ చూసినవాళ్లకి ఈ ఫీలింగ్ ఇంకాస్త క్రేజీ గా ఉంటుంది. ఇక సాయి ధరమ్ తేజ్.. తన పర్ఫార్మెన్స్ తో అద్దరగొట్టాడు అనే చెప్పాలి. ఎప్పుడూ బిజీ బిజీ అంటూ సాగే జీవితానికి.. ఆ జీవితం అంటే ఏంటి అని తెలుసుకునే ఓ సగటు మనిషిగా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక సాయిధరమ్ తేజ్ యాక్టింగ్, కామెడీ టైమింగ్ అన్నీ చాలా బావున్నాయి. మామ, అల్లుడు పోటీగా యాక్ట్ చేశారు అని చెప్పాలి.

టెక్నికల్‌ టీమ్:
టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. నిజానికి బ్రో మూవీ ఒక రీమేక్.. కనుక డైరెక్టర్ సముద్రఖని ఈ మూవీని చాలా ఈజ్ తో చేశారు. పైగా ఈ కాన్సెప్ట్ ని ఇష్టపడి మరీ తమిళంలో మొదట మూవీని తెరకెక్కించినప్పుడు ఎంతో ఇష్టంగా ప్లాన్ చేశారు. ఇప్పుడు తెలుగులో కూడా అంతే ఈజ్ తో ప్లాన్ చేశారు. అయితే తెలుగు నేటివిటీకి కాస్త కమర్షియల్ హంగులు అద్దారు. థమన్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూల్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ పీక్స్ అని చెప్పాలి. స్పెషల్ గా పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్ లో కెమెరా వర్క్ హైలెట్.

 

ప్లస్‌ పాయింట్స్ :
పవన్ కళ్యాణ్‌,
ఫస్ట్‌ హాఫ్‌
రన్‌ టైమ్‌

మైనస్ పాయింట్స్ :
స్లో నేరేషన్
ఫ్యాన్స్‌ బేస్డ్ సీన్స్
ఒరిజినల్ ఫ్లేవర్‌ మిస్ అవ్వడం

 

తీర్పు :
ఇప్పటికే చాలామంది వినోదాయ సీతంను తమిళంలో చూసినవారికి ఈ సినిమా కాస్త డల్ అనిపిస్తుంది. పైగా ఒరిజినాలిటీ మిస్ అవ్వడం, కమర్షియల్ ఎలిమెంట్స్ హైలెట్ అవ్వడంలో కంటెంట్ మిస్సింగ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ను హైలెట్ చేయాలనే ఆలోచనతో కంటెంట్ లో సోల్ ని మిస్ చేశారు. మెయిన్ గా పొలిటికల్ డైలాగ్, పంచ్ డైలాగ్స్ ను కూడా పెట్టడం కొంచెం టూ మచ్ అనిపించింది. ఫైనల్ గా ఈ మూవీ మెగా ఫ్యాన్స్ కి అయితే మంచి ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు.

 

ఫైనల్ గా :
మెగా ఫ్యాన్స్ కు మాత్రం సూపర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ‘బ్రో’.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...