Venu Swamy: ఒకప్పుడు టాలీవుడ్‌ని తన నటనతో పాటు అందచందాలతో ఓ ఊపు ఊపేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తెలుగులో సినిమాలు చేయడం లేదు. చేయడం లేదు అనడం కన్నా అవకాశాలు రావడం లేదు అని చెప్పాలి. ప్రస్తుతం బాలీవుడ్‌కే పరిమితమైన ఈ భామ పెద్దగా సక్సెస్‌లు అందుకోలేకపోతుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది. కేక పెట్టించే అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంది. ఇక తన బాయ్ ఫ్రెండ్‌తో పబ్లిక్‌గా తిరుగుతూ ఆమె చేసే సందడి పీక్స్ లో ఉందని చెప్పాలి.మూడు పదుల వయుసు క్రాస్ చేసిన ఈ హాట్ బ్యూటీ, కొంత కాలంగా జాకీ అనే నటుడితో ప్రేమాయణం కొనసాగిస్తోంది.
కొద్ది రోజుల క్రితం తమ ప్రేమ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించిన రకుల్ తన పెళ్లి విషయంపై ఇప్పటి వరకు నోరు విప్పడం లేదు. అయితే రకుల్ పెళ్లి చేసుకుంటే ఆమె జీవితం ఇంతకముందులా ఉండదని, అన్ని కష్టాలే ఉంటాయని వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆమె ప్రేమలో పడ్డప్పట్నుండి కెరియర్ ఏమాత్రం ఆశాజనకంగా లేదని,ఇండస్ట్రీలో ఎక్కువగా అవకాశాలు కూడా రకుల్‌కి రావడం లేదు. ఇక పెళ్లి చేసుకుంటే మాత్రం సమంత లాగా ఈమె కూడా తన భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉండాల్సిందేనని జోస్యం చెప్పారు. మరి వేణు స్వామి మాటలు విని రకుల్ పెళ్లి చేసుకోకుండా అలా ఉంటుందా , లేదంటే పెళ్లి చేసుకొని తాను ఎంత సంతోషంగా ఉందనేది వేణు స్వామికి చూపిస్తుందా చూడాలి.
నార్త్ బ్యూటీ అయిన రకుల్ కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ‘కెరటం’ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు హీరోయిన్ గా పరిచయం అయిన రకుల్…’తడయార తాక్క’ మూవీతో తమిళం ప్రేక్షకులని పలకరించింది. కెరీర్ మొదట్లో పెద్దగా సక్సెస్ లు రాకపోయినా, ఆ తర్వాత మాత్రం వరుస విజయాలు అందుకొని టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ప్రస్తుతం హిందీతో పాటు సౌత్ సినిమాలో అడపాదడపా అవకాశాలు అందుకుంటుంది. లోకనాయకుడు కమల్ హాసన్ తో కలిసి ‘ఇండియన్ 2’ అనే సినిమా చేస్తుండగా, ఈ మూవీ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ మూవీపై రకుల్ భారీ అంచనాలే ఉన్నాయి.