International Yoga Day: జూన్ 21వ తేదికి ఓ విశేషం ఉంది. అదేంటంటే ఈ ఒక్కరోజునే అంతర్జాతీయ యోగా దినోత్సవం అలాగే వరల్డ్ మ్యూజిక్ డే అన్నమాట. దేశ ప్రధాని మొదలుకుని సెలబ్రిటీలు, సామాన్యులు యోగాసనాలు వేస్తూ ఆ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నటసింహా, హిందూపూర్ ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ.. బసవతారకం ఆసుపత్రిలో జరిగిన యోగా దినోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. హాస్పిటల్ సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. లక్ష్మీ మంచు, సోనాల్ చౌహాన్, రకుల్ ప్రీత్ వంటి పలువురు సెలబ్రిటీలు యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తూ యోగాసనాలు వేసిన పిక్స్ షేర్ చేశారు.
https://www.instagram.com/p/CfDxIKHIapG/
వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా ‘మ్యాస్ట్రో’ ఇళయరాజా ఫ్యాన్స్ కామెంట్స్ చదివి సంబరపడ్డారు. తేజ తన తర్వాత సినిమా మ్యూజిక్ సిట్టింగ్ కోసం గోవా వెళ్లారు. ‘జై’ మూవీతో తేజ సంగీత దర్శకుడిగా పరిచయం చేసిన అనూప్ రూబెన్స్, పాపులర్ లిరిసిస్ట్ చంద్రబోస్ కూడా ఉన్నారు. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకెళ్లనుంది.
https://www.instagram.com/p/CfDznSSPT-M/
https://www.instagram.com/p/CfDox0dKbCf/
Leave a comment