ఈ మధ్య నిశ్చితార్థం కుదుర్చుకున్న మెహరీన్ ఉన్నపళంగా తన “would be” తో పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. కానీ, సినీ తారలు ఇలా చేయడం కొత్తేమీ కాదు. ఇప్పటిదాకా చాలామందే ఇలా తమ పెళ్ళిళ్ళని కాన్సిల్ చేసుకున్నారు. అవును.. నిశ్చితార్థం అయిన తర్వాతే! వాళ్లెవరో చూద్దాం.
మన భారతీయ సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం జరిగింది అంటే సగం పెళ్లి జరిగిపోయినట్టే. ఏవో పెద్ద కారణాలైతే తప్ప నిర్ణయించుకున్న పెళ్ళిళ్ళని రద్దు చేసుకోరు. సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదన్న ఉదాహరణలు చాలానే కనిపించాయి.
- ఉదయ్ కిరణ్ – సుష్మిత కొణిదెల
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మితతో హీరో ఉదయ్ కిరణ్ ఇద్దరూ ప్రేమించుకున్నారన్న వార్తలు వచ్చాయి. అందుకే ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేసిన తర్వాత కొంత కాలానికి వాళ్లిద్దరూ విడిపోవడం వల్ల ఆ పెళ్లి జరగకుండానే ఆగిపోయింది. తర్వాత సుష్మిత విష్ణుప్రసాద్ ని పెళ్లి చేసుకోగా, ఉదయ్ విశితని పెళ్లి చేసుకున్నాడు.
- త్రిష – వరుణ్
అందగత్తె త్రిష, బిజినెస్ మేన్ అయిన వరుణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. వాళ్ళిద్దరూ కలిసి తిరగడం పబ్లిక్ గానే ఉండేది. ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని.. పెళ్లి చేసుకునే రోజులు దగ్గర పడే సరికి వాళ్ళ మధ్య భేధాభిప్రాయాలు వచ్చి ఆ పెళ్లి ఆగిపోయింది. త్రిష పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని చెప్పడం ప్రధాన కారణమని పుకారు.
- అక్షయ్ కుమార్ – శిల్పాశెట్టి
బాలీవుడ్ సెలెబ్స్ అయిన వీళ్లిద్దరి మధ్య కూడా ప్రేమ వ్యవహారం నడిచింది. పెళ్లి చేసుకునే సమయానికి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. అక్షయ్ ట్వింకిల్ ఖన్నాని చేసుకోగా, శిల్ప వ్యాపారవేత్త ఐన రాజ్ కుంద్రాని చేసుకుంది.
- ప్రభుదేవా – నయన్
ముద్దుగుమ్మ నయనతార, గ్రేట్ డాన్సర్ ప్రభుదేవా ఇద్దరూ బాగా ప్రేమించుకున్నారు. కలిసి తిరిగారు. నయనతార ప్రభుదేవా కోసం తన మతం మార్చుకునే ఆలోచనలో కూడా ఉన్నట్టు వార్తలొచ్చాయి. అప్పటికే ఒక పెళ్లి చేసుకుని ఉన్న ప్రభుదేవా ఆమెకి విడాకులు కూడా ఇచ్చాడు. కానీ, వీళ్ళ మధ్య ఏం జరిగిందో తెలీదు. వాళ్ళు పెళ్లి దాకా మాత్రం వెళ్లలేదు.
- అఖిల్ – శ్రియ భూపాల్
వీటన్నిటిలోకెల్లా మోస్ట్ immatured ఎంగేజ్మెంట్ ఏదైనా ఉందీ అంటే అది ఇదే. హీరో నాగార్జున కొడుకు అఖిల్, మరో వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన శ్రియ అనే అమ్మాయి పెళ్లి చేసుకుందాం అని బాగా తొందర పడ్డారు. అందరినీ ఏకం చేసి.. ఎంగేజ్మెంట్ చేసుకుని మీడియాకి ఫోజులిచ్చారు కానీ డ్రమటిక్ గా వీళ్ళ మధ్య ఏమైందో తెలీదు ఉన్నపళంగా మేం పెళ్లి చేసుకోవట్లేదని పెద్దలకి చెప్పారు. తలలు పట్టుకోవడం వాళ్ళ వంతు.
- రష్మిక – రక్షిత్ శెట్టి
పేర్లు బాగా కలిసిపోయాయి కాబట్టి.. మనం కూడా కలిసిపోదాం అనుకున్నారు వీళ్ళిద్దరూ.. కానీ, ఎంత తొందరగా ఉంగరాలు తొడుక్కుని ఫోటోలకి ఫోజిచ్చారో అంతే తొందరగా పెళ్లి కాన్సిల్ చేసుకున్నారు.
Leave a comment