Kaikala Satyanarayana: 60 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో జానర్లలో, మరెన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి తెలుగు ప్రేక్షకులను అలరించారు ‘నవరస నటనా సార్వభౌమ’ కైకాల సత్య నారాయణ. జూలై 25న ఆయన 87వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కైకాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కైకాల పుట్టినరోజు వేడుకలు జరిపారు.
గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతన్నారు కైకాల. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారాయన. సోమవారం సత్య నారాయణను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి.. దగ్గరుండి కేక్ కట్ చేయించారు చిరు.
‘‘పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున,వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది. ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు చిరు.
Leave a comment