Chiranjeevi Flops: మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించి మెగాస్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చేసిన సినిమాలలో చాలా సినిమాలు బాక్సాఫీస్ రికార్డులని బద్దలు కొట్టాయి.అయితే చిరు కెరీర్ సక్సెస్ ఫుల్గా సాగుతుండగా, మధ్యలో రాజకీయాలలోకి వెళ్లారు.తొమ్మిదేళ్ల పాటు రాజకీయాలలో ఉన్న తర్వాత ఖైదీ నెం 150 సినిమాతో తిరిగి సినిమాలలోకి వచ్చారు. ఈ చిత్రం మంచి విజయం సాధించి ప్రేక్షకులని, అభిమానులకి మంచి జోష్ అందించింది. ఈ సినిమా తర్వాత చిరు చేసిన సినిమాలు పెద్దగా విజయాలు సాధించడం లేదు. గత నాలుగు సినిమాలలో ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు దారుణమైన నిరాశ మిగిల్చాయి.
ఈ మూడు సినిమాలు కూడా దారుణంగా ఫ్లాప్ కావడం, భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించకపోవడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే చిరంజీవి నటించిన ఆ సినిమాలు ఫ్లాప్ కావడానికి ఒక వ్యక్తి కారణమంటూ నెటిజన్స్ వింత కారణం చెబుతున్నారు. ఆచార్య,గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాలలో ఒక వ్యక్తి నటించాడని అతని వల్లే సినిమా ఫ్లాపైందని అంటున్నారు. వివరాలలోకి వెళితే మెగా ఫ్యామిలీకి చెందిన కొణిదెల పవన్ తేజ్.. చిరంజీవి నటిస్తున్న సినిమాలలో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు .ఫ్లాపైన మూడు సినిమాలలో పెద్దగా గుర్తింపు లేని పాత్రలలో కొణిదెల పవన్ తేజ్ కనిపించి సందడి చేసే ప్రయత్నం చేశారు.
పవన్ తేజ్ నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో చిరంజీవి తన సినిమాలలో కొణిదెల పవన్ తేజ్ ను ఎంచుకోవద్దని నెటిజన్ల నుంచి పలు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే మరికొందరు వీటిని కొట్టి పారేస్తున్నారు. సినిమాలో కంటెంట్ ఉంటే తప్పక సక్సెస్ అవుతుంది. ఈ చెత్త కారణాలు వెతకొద్దు అని మరి కొందరు సూచిస్తున్నారు. ఇక చిరంజీవి సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా ఆ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టలేకపోవడం గమనర్హం. రానున్న రోజులలో అయిన చిరు తన సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టి సినిమాలు హిట్టయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.