ఈ రోజే ప్రకాష్ రాజ్ పెట్టిన ప్రెస్ మీట్ లో ఆయన ప్యానల్ సభ్యులు అందరూ కూడా మీడియా ముందు హాజరైనట్లు తెలిసిందే. ఈ ప్రెస్ మీట్ లో నాగబాబు కూడా మాట్లాడాడు. ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. మొదటి సారి.. మా ఎన్నికలకు సంబందించి.. ఇక్కడ ఉన్న పరిస్తితులని మార్చేస్తామని చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించిందని, ఆ మార్పు రావాల్సిన అవసరాన్ని మేం గుర్తించాం కాబట్టే ఈ ప్యానల్ కి సపోర్ట్ చేస్తున్నామని చెప్పాడు నాగబాబు. ప్రకాష్ రాజ్ స్వయంగా మంచి మనిషి అని చెప్తూ.. ఆయన చేసిన మంచి పనులని గుర్తుచేసారు.
ప్రకాష్ రాజ్ అంటే గిట్టని వాళ్ళు ఆయనపై కామెంట్లు చేస్తున్నారని.. ఆయన లోకల్ కాదని అనడంపై మంచి వివరణ ఇచ్చారు. ఇక్కడ అందరూ ఇండియన్స్ తప్ప పలానా భాష, ప్రాంతం అని అనుకోవడానికి లేదని, అమితాబ్ బచ్చన్ లాంటి వాడే నన్ను బాలీవుడ్ కి మాత్రమే పరిమితం చేయకండి నేను మొత్తం ఇండియాకి చెందిన నటుడిని అని చెప్పాడని గుర్తు చేసాడు. ఒకవేళ ఈ విషయాన్ని సీరియస్ గా చూసినా.. ప్రకాష్ రాజ్ తెలుగు వాళ్ళకి ఏంతో దగ్గరి మనిషి అని, ఆయన్ని ఇక్కడి వాడు కాదనడానికి వీలు లేదని అన్నారు.
అమెరికా లాంటి దేశాల్లోనే ఒక పది సంవత్సరాలు అక్కడ పౌరసత్వం వచ్చేస్తుందని, ఏకంగా వైస్ ప్రెసిడెంట్ కి కూడా పోటీ చేసే అవకాశం వస్తుందని, కమలా హారిస్ ఆ విషయాన్ని చేసి చూపించారని గుర్తు చేసాడు. అలాంటి గొప్ప వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా చిన్నవాళ్ళమని, ఇక్కడే మూడు గ్రామాలని దత్తత తీసుకుని, కష్టాల్లో ఉన్న పేదవాళ్ళకి ఇల్లు కట్టించి, సాటి నటులకి కూడా అండగా ఉండే ప్రకాష్ రాజ్ ఇక్కడ పోటీ చేయడానికి, గెలిచి బాధ్యతలు చేపట్టడానికి అర్హుడైన వాడని చెప్పాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రకాష్ రాజ్ కి, ఆయన ప్యానల్ కి అన్నయ్య చిరంజీవి సపోర్ట్ ఉందని, కానీ ఆయన ప్రత్యక్షంగా ఈ ఎన్నికల్లో పాల్గొనకపోయినా.. ఇక్కడ పూర్తి సహకారం ఉంటుంది అని మీడియా ముఖ్యంగా చెప్పాడు నాగబాబు.
Leave a comment