మరో మూడు నెలల్లో జరగబోతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారుతున్నట్టు అనిపిస్తుంది. అందరికన్నా ముందుగా ముందుకి వచ్చి.. తన ప్యానల్ ని ప్రకటించి కచ్చితంగా తామే గెలుస్తామని చెప్పినా ప్రకాష్ రాజ్ తర్వాత వెంటనే మరో వర్గం మరుసటి రోజు మరో మీడియా సమావేశం పెట్టి వాళ్ళ వాదనలు వినిపించారు. అప్పటినుంచి మా ఎన్నికల నేపథ్యంలో కచ్చితమైన రెండు భిన్న వర్గాలు ఉన్నాయని అనిపించింది.
ఆ తర్వాత హేమ రూపంలో మరో ప్యానల్ ఏర్పాటు అయిందన్న విషయం తెలిసిందే. వాళ్ళు కూడా తమ వాదనలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఐతే వీళ్లిద్దరితో పాటు జీవితా రాజశేఖర్ ల మరో వర్గం కూడా ఎన్నికల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. తర్వాత కొన్ని రోజులకి కొత్తగా సీవీఎల్ నరసింహారావ్ అనే వ్యక్తి ఈ మా ఎలక్షన్లలో పోటీ చేయబోతున్నట్లు తెలిసింది. ఆయన ఇందులో పాల్గొనటానికి న్యాయమైన కారణాలు ఉన్నాయని ఒక వీడియోలో చెప్పారు.
ఇప్పటికే తెలంగాణా, ఆంధ్రా రాష్ట్రాలకు సంబంధించి రకరాకల శాఖలు వేరుగా ఉన్నాయని ఇప్పుడు కొత్తగా ఈ మా సంఘం కూడా విడిపోతే ఎలాంటి తప్పూ లేదని ఆయన అన్నారు. ఇప్పటికే ‘మా’ తెలంగాణా ఉందని దానికి ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. ఐతే, తను అనుకుంటున్న ప్రకారం మొత్తం 18 పోస్ట్ లు ఉండే ‘మా’ లో 9 పోస్ట్ లని కచ్చితంగా తెలంగాణా వాళ్ళకి కేటాయించేట్లయితే విడదీయాల్సిన అవసరం ఉండదని గుర్తు చేస్తారు. ఒకవేళ అలా కూడా చేయకపోతే.. ఇప్పటికే నష్టపోతున్న తెలంగాణా కళాకారులు మరింత నష్టపోయే అవకాశం ఉన్నట్లు ఆయన గుర్తుచేసారు.
ఏది ఏమైనా అంతా అన్నదమ్ముల్లానే ఈ ఏర్పాట్లు చేసుకోవచ్చని, ఈ కారణాల చేత నేను కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఆయన అన్నారు. ఐతే, ఆయన ఇలా ప్రకటించిన వెంటనే ఆయనకు ఒక ప్రముఖ వ్యక్తి నుంచి సపోర్ట్ అందింది. ఆమే విజయశాంతి. ఆమెలోనూ తెలంగాణా సెంటిమెంట్ ఉండటంతో.. ఈ ఎన్నికల్లో తెలంగాణా వాళ్ళకి సమానమైన చోటు ఉండాలనే కోణంలో ఆమె మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది.
Leave a comment