తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో కొత్తగా చెప్పనవసరం లేదు.. దివంగత లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు నటవరసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన విక్టరీ వెంకటేష్ నాలుగు దశాబ్దాలు టాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అలాగే రామానాయుడు పెద్ద కొడుకు డి సురేష్ బాబు కూడా తెలుగు చాత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నిర్మాతలలో ఒకరిగా ఇండస్ట్రీని ఏలుతున్నారు.
ఈ కుటుంబం నుంచి మూడో తరం హీరోగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన రానా కూడా స్టార్ హీరో గానే కాకుండా విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాన్ ఇండియా లెవెల్ లో అదరగొడుతున్నాడు.అలాగే కుటుంబం నుంచి దగ్గుబాటి హీరోగా మంచి పాపులారిటీ తెచ్చుకున్న అభిరామ్ కూడా.. రీసెంట్ గానే వివాహ బంధంతో ఓ ఇంటివాడయ్యాడు… సినిమాల్లోకి రాకముందు నుంచే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయిన అభిరామ్.. హాట్ బ్యూటీ శ్రీరెడ్డితో నడిపిన యవ్వారాల గురించి అందరికీ తెలిసిందే.
అయితే ఇప్పుడు శ్రీరెడ్డిని కాదని ఆయన తన మరదలు ప్రత్యూషను పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ హాట్ గా మారింది.దగ్గుబాటి హీరోనే పెళ్లి చేసుకుంటున్నా శ్రీరెడ్డి మాత్రం స్పందించకపోవడం ఇప్పుడు అభిమానుల్లో కొత్త డౌట్లు పుట్టిస్తుంది.అభిరామ్- ప్రత్యూషల పెళ్లి శ్రీలంకలో ఎంతో ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే ఈ పెళ్లి ఫోటోలు చూసినా కొందరు అభిరామ్ మ్యారేజ్ లైఫ్ పై దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. నువ్వు శ్రీరెడ్డిని పెళ్లి చేసుకోకపోయినా అలాంటి ఫేస్ కట్స్ ఉన్న అమ్మాయే నీకు భార్యగా వచ్చింది.. ఏం అదృష్టం చేసుకున్నాం బ్రో.. అంటూ పిచ్చిపిచ్చిగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది శ్రీరెడ్డిని కావాలని ఈ మేటర్ లో ఇరికిస్తూ అసభ్యంగా కౌంటర్లు వేస్తున్నారు.. ఇక దీంతో ఈ దగ్గుబాటి హీరో పెళ్లి ఫొటోస్ వైరల్ గా మారాయి.