ఎన్టీఆర్ అభిమానులు ఏదైతే జరగకూడదు అనుకున్నారో.. ఇప్పుడు అదే జరగబోతుంది.. దేవర మూవీ వాయిదా పడిందనే మాట ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దీనికి పలు కారణాలు కూడా చెబుతున్నారు. ఈ మూవీలో విలన్ గా నటిస్తున్న సైఫ్ ఆలీఖానికి షూటింగ్లో గాయాల అవటం ఒకటైతే.. తర్వాత ఏపీ ఎలక్షన్స్ కూడా ఎన్టీఆర్ దేవరను వెనక్కి వేళ్లేలా చేసిందని అంటున్నారు. ఏప్రిల్5న దేవర రిలీజ్ అని ముందే అనౌన్స్ చేశారు మేకర్స్.
అదే సమయంలో ఎన్నికలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ సినిమా యూనిట్ దేవరను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వీటికి తోడు ఏప్రిల్ 5న బాలీవుడ్ సినిమాలతో పోటీ ఉంటుంది. అదే రోజు ఈద్ కావడంతో అక్కడ థియేటర్లు దొరకడం కూడా చాలా కష్టం. ఇలా పలు కారణాలతో దేవర వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉంది అని అంటున్నారు.. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఈ సినిమా యూనిట్ నుంచి ఇంక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే బయటకు రాలేదు.. కానీ దాదాపు దేవర మూవీ వాయిదా పడినట్టే అని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.
ఇక ఎన్టీఆర్ దేవర సినిమా ఎప్పుడు వస్తుంది.. అంటే దానిపై కూడా కొత్త చర్చ జరుగుతుంది. సమ్మర్ ఎండింగ్ లేదా ఆగస్టు అప్పటికి కుదరకపోతే సెప్టెంబర్ లో దేవరను రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఆగస్టులో దేవర వస్తుందంటే అప్పటికే పుష్ప2 ఆగస్టు రేసులో ఉంది. ఒకవేళ దేవర ఆగస్టు 15న వస్తే పుష్ప2 కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ పుష్ప సెకండ్ పార్ట్ ని కూడా డిసెంబర్ కు రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది. అయితే ఈ వార్తలపై కూడా ఇంకా క్లారిటీ లేదు.. కానీ దేవర పార్ట్ వన్, పుష్ప2 రిలీజ్ డేట్‌లు మాత్రం అభిమానులను ఎంతో కన్ఫ్యూజ్‌లు పడేశాయి. ప్రస్తుతానికి దేవర టీం నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.