Dhanush: ధనుష్.. తమిళ్‌తో పాటు ‘ఫకీర్’, ‘ది గ్రే మ్యాన్’ లాంటి హాలీవుడ్ సినిమాలు.. ‘రాంజానా’, ‘అత్రాంగి రే’ లాంటి హిందీ మూవీస్‌లో నటించిన టాలెంటెడ్ యాక్టర్, మల్టీ టాలెంటెడ్ ధనుష్.. ‘సార్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
‘ది గ్రే మ్యాన్’ సీక్వెల్లోనూ నటించబోతున్నట్టు కన్ఫమ్ చేశారు. కోలీవుడ్‌లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ధనుష్, నిత్యా మీనన్, రాశీ ఖన్నా, ప్రియా భవానీ శంకర్ మెయిన్ లీడ్స్‌గా నటిస్తున్న తమిళ్ సినిమా ‘తిరుచిత్రమ్ బలం’ (Thiruchitrambalam)..
మిత్రన్ ఆర్ జవహర్ దర్శకుడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఆగస్టు 18న సినిమా రిలీజ్ కానుంది. రీసెంట్గా థియేట్రికల్ ట్రైలర్ వదిలారు. సీనియర్ డైరెక్టర్ భారతీ రాజా, ధనుష్ తాతగా.. ప్రకాష్ రాజ్ తండ్రిగా కనిపించారు. నిత్య మీనన్ చిన్నప్పటినుండి ఫ్రెండ్.. అతని ప్రేమకు కూడా హెల్ప్ చేస్తుండడాన్ని చూపించారు. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. అనిరుధ్ సంగీతమందిస్తున్నారు.
Leave a comment