కేవలం ఫీల్ గుడ్ సినిమాలు మాత్రమే చేసే శేఖర్ కమ్ముల ఒక మాస్, కమర్షియల్ నటుడితో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ధనుష్ తో కలిసి సంప్రదింపులు కూడా జరపడం జరిగింది. ప్రస్తుతం పెద్ద సినిమాలుగా వస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ గా వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే అదే రీతిలో ఈ సినిమా కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.
ఈ వార్త బయటికి రాగానే ధనుష్ అభిమానులు కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శేఖర్ కమ్ములతో ధనుష్ చేయబోయే సినిమా ఎలా ఉండబోతుందో చూడాలన్న కోరిక వాళ్ళలో బలంగా ఉంది. దాదాపు ధనుష్ ఎప్పుడు ఈ తరహా డైరెక్టర్ తో సాహసాలు చేయలేదు ఇంతకుముందు. కానీ ఇప్పుడు చేయాలి అనుకుంటున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తనకు తానే ట్విట్టర్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నాడు.
మరోవైపు శేఖర్ కమ్ముల వేరే ప్రాజెక్ట్స్ తో కూడా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన డైరెక్ట్ చేసిన ‘లవ్ స్టోరీ’ అనే మూవీ ఒక ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లాక్ డౌన్ నిబంధనల కారణంగా ఈ మూవీ ఇంకా రిలీజ్ అవలేదు.
Leave a comment