Chiranjeevi: దాదాపు 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్- ఉపాసన దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. జూన్ 20న రామ్ చరణ్ ఆడబిడ్డకు జన్మనివ్వగా, 30న నామకరణం కార్యక్రమం నిర్వహించి క్లింకార అని పేరు పెట్టారు. అయితే క్లింకార ఎలా ఉంది? తాత చిరంజీవి, తండ్రి రామ్చరణ్ పోలికలు వచ్చాయా? అంటూ అభిమానులు రామ్చరణ్-ఉపాసన దంపతులను సోషల్ మీడియా వేదికగా తెగ అడుగుతున్నారు. ఒక్కసారి క్లింకార ఫొటోలు షేర్ చేయండంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఉపాసన డిశ్చార్జ్ తర్వాత మీడియాతో మాట్లాడిన రామ్ చరణ్ పాపకి తన పోలికలే వచ్చాయని అన్నారు.
రీసెంట్గా క్లింకార గురించి సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్లింకారకు తన తండ్రి పోలికలే వచ్చాయి. అచ్చం రామ్చరణ్ లాగే ఉంటుంది. కళ్లైతై చాలా బాగున్నాయి. నాకు తెగ నచ్చేశాయి. అమ్మాయి తండ్రి పోలికలతో పుడితే అదృష్టమంటారు. క్లింకార విషయంలోనూ అదే జరిగింది’ సాయి ధరమ్ తేజ్ బ్రో ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. అయితే క్లింకార మహజ్జాతకురాలు అని పలువురు జ్యోతిష్కులు చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. క్లింకారు పుట్టిన వేళ విశేషం వలన రామ్ చరణ్, చిరంజీవికి అదృష్టం చాలా కలిసి వస్తుందని అంటున్నారు.
తాజాగా చిరంజీవికి రూ.2వేల కోట్ల లాభం వచ్చిందని, అది క్లింకార వల్లనే జరిగిందని కొందరు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కోకాపేటలో భూమి ధరలకి రెక్కలు రాగా, అది అమ్మితే లెక్కలేనంత డబ్బు వస్తుంది. కోకాపేటలో ఎకరం భూమి ఏకంగా 100 కోట్లు దాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది.. అయితే అక్కడ మెగాస్టార్ చిరంజీవికి 20 ఎకరాల భూమి ఉందట.. ఈ క్రమంలో ఇప్పుడు ఈ భూమి అమ్మితే 2 వేల కోట్లు వస్తాయని అంతా మనవరాలు పుట్టిన వేళా విశేషం అని కొందరు ముచ్చటించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఫిలిం నగర్లో తెగ హల్చల్ చేస్తుంది