Nirmalamma: ఒకప్పటి సీనియర్ నటి నిర్మలమ్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అత్తగా, తల్లిగా, బామ్మగా పలు సపోర్టింగ్ క్యారెక్టర్స్ పోషించింది నిర్మల. అప్పట్లో నిర్మలమ్మని మంచిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరు లేరంటే అతిశయోక్తి కాదు. బామ్మ పాత్రలకి నిర్మలమ్మ కేరాఫ్ అడ్రెస్. ఆమె సహజమైన నటన తెలుగు చిత్రాలనే కాదు, మన తెలుగు లోగిళ్ళనూ పూనితం చేసిందనే చెప్పొచ్చు. వందలాది తెలుగు చిత్రాలలో బామ్మగా, తల్లిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన నిర్మలమ్మ చమత్కారంగానో, చివట్లేస్తూనే కనిపించే పాత్రకు ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంటారు. ఆమె మన మధ్య భౌతికంగా లేకపోయినా, నిర్మలమ్మ అలనాటి చిత్రాలలోని డైలాగ్స్ ఇప్పటికీ మనకి ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది.
నిర్మలమ్మ అసలు పేరు రాజమణి కాగా, ఆమె పుట్టింది 1926, జూలై 18న గంగయ్య, కోటమ్మ దంపుతులకు బందర్లో జన్మించింది.తనకి ఊహ తెలిసినప్పటి నుండి నాటకాలలో నటించి అలరించింది. ఎంతో వెలుగు వెలిగిన నిర్మలమ్మ తమ చివరి రోజుల్లో మాత్రం చాలా దారుణంగా చీమలు పట్టి ఎవ్వరూ కూడా చూడలేని పరిస్థితుల్లో చనిపోయిందట. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి వంటి వారితో నటించడంతో పాటు ఆమె సెట్లో ఉన్నప్పుడు అందరికి స్వయంగా ఆహారం తీసుకొని వచ్చేది. కోట్లు సంపాదించిన కూడా ఆమె చాలా సింపుల్ లైఫ్ అనుభవించింది.
నిర్మలమ్మ కృష్ణారావు దంపతులకు సంతానం లేకపోవడంతో ఆమె కవిత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఇక ఆమెకి గ్రాండ్ గా పెళ్లి చేసి చెన్నైకి పంపించారు. అయితే కూతురికి పెళ్లి చేసిన తర్వాత ఆమె ఒక్కతే హైదరాబాద్లో సింగిల్ గా ఉంది. ఆరోగ్యం బాగున్నప్పుడు సంతోషంగా ఉన్న నిర్మలమ్మ చివరి దశకు వచ్చే సరికి మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. తన ఇంట్లో ఓ మూలన మంచంపై పడుకొని, చివరికీ చీమలు కుడుతున్న కూడా కదలలేని స్థితిలో ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లడం ప్రతి ఒక్కరిని బాధించింది. ఎంతో మందికి తనవంతు సహాయ సహకారాలు అందించిన నిర్మలమ్మ జీవితం ఈవిధంగా ముగియడం ప్రతీ ఒక్కరినీ కన్నీరు పెట్టించింది.