Niharika Astrology: ఇప్పుడు ఏ ఇద్దరి మధ్య చర్చ నడిచిన అందలో నిహారిక విడాకుల మేటర్ తప్పక ఉంటుంది. ఎంతో గారాబంగా పెంచి ఆకాశమంత పందిరి భూదేవి అంత పీట వేసి అట్టహాసంగా తన కూతురి పెళ్లి జరిపించారు నాగబాబు. కొడుకు కోడలు సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు కలిసి ఉంటారనుకుంటే పట్టుమని మూడేళ్లు కాకముందే విడాకులు తీసుకున్నారు. నిహారిక-చైతన్య విడాకుల విషయంపై ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల నుండి నిహారిక-చైతన్య విడాకులు తీసుకుపోతున్నారు అంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఎవరు కూడా స్పందించలేదు.
నిహారిక నటించిన వెబ సిరీస్ మూవీ ప్రమోషన్లో ఆమెకి విడాకుల గురించి ప్రశ్న ఎదురు కాగా, దానిని స్కిప్ చేసింది.అయితే కూకట్ పల్లి కోర్టు జూన్ 5వ తేదీన విడాకులు మంజూరు చేయగా,అందుకు సంబంధించిన దరఖాస్తు బయటకు రావడంతో అసలు విషయం బయటపడింది. దీంతో నిహారిక, చైతన్యలు తమ సోషల్ మీడియా ద్వారా విడాకుల విషయాన్ని కన్ఫాం చేశారు.. దీంతో మెగా కుటుంబంలో ఇలా విడాకుల పర్వం ఎందుకు సాగుతుందని ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుడి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు విడాకులు తీసుకొని ప్రస్తుతం మూడో భార్యతో కలిసి ఉంటున్నారు. ఇటీవల మూడో భార్యకి విడాకులు ఇచ్చినట్టు ప్రచారం జరగగా, దానిని కొట్టిపడేశాయి జనసేన శ్రేణులు.
ఇక చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకోగా, అవి పెటాకులు అయ్యాయి. ఇప్పుడు నిహారిక కూడా వారి దారిలోనే పయనిస్తుందని అంటున్నారు. అయితే నిహారిక విడాకుల విషయం గురించి ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి ఎప్పుడో చెప్పాడని, ఆమె జాతకం ప్రకారం చైతన్య తో విడిపోతుందని అన్నాడనే వార్త ఇప్పుడు వైరల్గా మారింది. పెళ్లి అయిన కూడా ఆమెకు సంతానం ఉండదని కూడా ఆయన అన్నాడట. ఇక నిహారిక జాతకం ప్రకారం ఆమె మళ్ళీ పెళ్లి చేసుకున్నా కూడా విడాకులు తీసుకుంటుందని, ఆమె జాతకం ప్రకారం పెళ్లి జవితం సరిగా లేదని వేణు స్వామి చెప్పినట్టు కొన్ని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.