JD Chakravarthy: జేడీ చక్రవర్తి పేరు ఇప్పటి వాళ్లకి పెద్దగా తెలియకపోవచ్చు కాని పాత తరం వారికి మాత్రం చాలా సుపరిచితం. హీరోగా, విలన్‌గా, సపోర్టింగ్ పాత్రలలో ప్రేక్షకులని ఎంతగానో అలరించిన జేడీ చక్రవర్తి రీసెంట్గా దయా అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా జేడీ చక్రవర్తి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకి సన్నిహితంగా ఉండే వ్యక్తి విషం పెట్టారని , తనకి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోవడం వలన క్షేమంగా బయటపడ్డానని జేడీ అన్నారు. అయితే జేడీ చక్రవర్తి.. తన భార్య విషం పెట్టిందని చెప్పకపోయినా థంబ్ నెయిల్ లో తప్పుగా పేర్కొనడంతో ఆమెనే విషం పెట్టినట్టు ప్రచారం సాగింది. తన భార్యపై దారుణంగా ట్రోల్స్ వస్తుంటే వాటిపై ఎట్టకేలకు ఒక ఇంటర్వ్యూలో స్పందించారు జెడి చక్రవర్తి.
నా భార్య నాకు విషం పెట్టిందని చెప్పకపోయిన కూడా కొందరు కావాలని యూట్యూబ్ థంబ్ నెయిల్ పెట్టి మా జీవితాలతో ఆడుకుంటున్నారని జేడి చక్రవర్తి ఆవేదన వ్యక్తం చేశారు. నా భార్య నాకు ఏ రోజు అన్యాయం చేయలేదని కూడా ఆయన అన్నారు. నా భార్య నాకు స్లో పాయిజన్ ఇచ్చారని నేను ఎప్పుడు చెప్పలేదు.ద్రోహం దగ్గరుండే వాళ్లు మాత్రమే అలాంటి పనులు చేయగలరని ఆయన వెల్లడించారు.డాక్టర్ నాగార్జున గారి వల్ల నేను కోలుకోవడం సాధ్యమైందని జేడీ చక్రవర్తి స్పష్టం చేశారు. జేడి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక తాను ఎప్పుడో క్రైమ్ చేసినట్టు చెప్పిన జేడి… శివ సినిమాకి ముందే ఆ క్రైమ్ చేసిననట్టు స్పష్టం చేశారు. పెళ్ళికొడుకు గెటప్ లో ఉండి షూట్ లో పాల్గొంటే పెళ్లి అయిపోయినట్టేనా అంటూ జేడీ ప్రశ్నించారు. తనకి ఏ సినిమాలో ఏ గెటప్ వేస్తే ఆ గెటప్ లో ఫోటో తీసుకోవడం అలవాటు అనా స్పష్టం చేశారు జేడి. ఇక ఇదిలా ఉంటే ఇటీవల జేడీ చక్రవర్తిని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి.. సత్య తర్వాత చాలా సినిమాలు ఫెయిల్ అయ్యాయి. ఆ స్క్రాప్ పీరియడ్ లో ఏం చేశారు అన్నట్లుగా ఆమె ప్రశ్నించింది. దానికి స్పందించిన ఆయన .. ఆ స్క్రాప్ పీరియడ్ వల్లే నీలాంటి వారితో కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది అంటూ కాస్త ఘాటుగా స్పందించడంతో యాంకర్ ఫేస్ చిన్నబోయింది.