Chiranjeevi-Venkatesh: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగిన వారిలో ఎన్నో తరాలు తారలుగా వెలుగుతున్నారు. ఇక ఎన్టీఆర్ శకం తర్వాత చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జునల టైమ్ వచ్చింది. కానీ వీరి కాంబినేషన్ లో మాత్రం మల్టీస్టారర్ లు రాలేదు. ఏన్నో ఏళ్ల తర్వాత వెంకటేష్, మహేష్ బాబులు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మూవీలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో అప్పట్నుండి సినిమాల్లో మల్టీస్టారర్ లు ఎక్కువగా వస్తున్నాయి. ఇక చిరు, వెంకీ కాంబోలో ఓ మల్టీస్టారర్ మూవీ మిస్ అయ్యింది. బాలీవుడ్ లో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ నటించిన ‘అందాజ్ అప్నా అప్నా’ అనే ఓ మల్టీస్టారర్ మూవీ వచ్చింది. ఈ సినిమా బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.
ఈ సినిమా అంత ఘన విజయం సాధించడంతో ఈ సినిమాని తెలుగులో చిరంజీవి, వెంకటేష్ లతో కలిసి తెరకెక్కించాలని ఈవీవీ సత్యనారాయణ ప్లాన్ చేశారు. అప్పుడే వీరిద్దరికీ కూడా ఈ కథను వినిపించారు. ఈ కథ నచ్చడంతో వీరిద్దరూ కూడా ఈ సినిమాకు మల్టీస్టారర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఆ టైమ్ లో ఈ ఇద్దరు హీరోలు వేరే వేరే సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. దాంతో ఈ సినిమా కూడా డిలే అయ్యింది. అలా ఈ సినిమా క్యాన్సిల్ కూడా అయిపోయింది. అలా చిరంజీవి, వెంకటేష్ ల కాంబినేషన్ లో మంచి మల్టీస్టారర్ మూవీ మిస్ అయ్యింది.
ఇక ఇప్పటి జనరేషన్ హీరోల విషయానికి వస్తే ఎంతో అండర్ స్టాండింగ్ తో ఎన్నో సినిమాలు మల్టీస్టారర్ గా వస్తున్నాయి. ముఖ్యంగా వెంకటేష్ ఎప్పుడూ కూడా మల్టీస్టారర్స్ చేసేందుకు ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. మళ్లీ ఆయనే గోపాల గోపాల మూవీతో పవన్ కళ్యాణ్, వెంకటేష్ లు కలిసి నటించారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా రానాతో, రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ తో కలిసి మల్టీస్టారర్స్ చేశారు.