థియేటర్లు ఎనిమిదవ తారీఖు నుండి మళ్ళీ మొదలు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ వార్త విన్నప్పటి నుండి.. తాము చాలా కాలంగా ఎదురుచూస్తున్న సినిమాలని హాల్స్ లో చూసే అవకాశం వస్తుందని చాలా సంతోషంగా ఉన్నారు అభిమానులు. మరోవైపు.. సినీ నిర్మాతలు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసారు.
ముఖ్యంగా దిల్ రాజు వంటి ప్రముఖులు ఒక తెలివైన ఆలోచనతో ముందుకు వచ్చినప్పటికీ దానికి థియేటర్ల యజమానులు ఓకే చెప్పటం లేదని తెలిసింది. దిల్ రాజు ఆలోచన ప్రకారం.. థియేటర్లపై లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తేశారు కాబట్టి.. ఇప్పటికే రిలీజ్ చేసేసిన వకీల్ సాబ్ సినిమాని మళ్ళీ రీరిలీజ్ చేసి మరోసారి ఆ రాబడిని ఎంజాయ్ చేయవచ్చు.
కానీ, ఈ ఆలోచనని థియేటర్ల యజమానులు ఎంటర్టైన్ చెప్పడం లేదు. వాళ్ళ ప్రకారం.. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలని ఎవ్వరూ మళ్ళీ థియేటర్ కి వచ్చి ప్రత్యేకంగా చూడాలని అనుకోరని, అదెంత గొప్ప సినిమా అయినా ఒక్కరోజు కంటే ఎక్కువ పాత సినిమాని మళ్ళీ రిలీజ్ చేసిన లాభాలు గడించడం అనేది జరగదు. అలాగే, కొత్త సినిమాలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి.. ఎప్పుడైనా కొత్త సినిమాలని రిలీజ్ చేసుకోవడమే బెటర్ అని వాళ్ళు నమ్ముతున్నారు.
సో, దిల్ రాజు ప్లాన్ ఉత్తిత్తే అయిపోయిందన్నమాట!
Leave a comment