M S Raja Shekhar Reddy: సోషల్ మీడియాలో సినిమా, రాజకీయాల గురించి.. హీరోల ఫ్యాన్స్, పార్టీ కార్యకర్తల మధ్య ఏ రేంజ్‌లో రచ్చ జరుగుతుందో, పోస్టులు, ట్వీట్లతో ఎంతలా గొడవ పడతారో కొత్తగా చెప్పక్కర్లేదు. సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేసుకునే స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుంది.
సెలబ్రిటీలు ఏదైనా ఒక విషయం గురించి స్పందిస్తే ఎలాంటి హంగామా అవుతుందో తెలియదు కాబట్టి ఆచి తూచి వ్యవహరిస్తుంటారు. మాగ్జిమమ్ రాజకీయాలకు సంబంధించిన ట్వీట్లకు దూరంగా ఉంటారు. అయితే ఇప్పుడు ఓ అప్‌కమింగ్ డైరెక్టర్ ఏపీలోని ప్రతిపక్ష పార్టీ గురించి, ఓ అగ్ర కులం గురించి చేసిన ట్వీట్స్ పెద్ద ఎత్తున గొడవలకు దారితీసాయి.
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న రీసెంట్ ఫిలిం ‘మాచర్ల నియోజకవర్గం’. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఎడిటర్ ఎస్.ఆర్. శేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇంతకుముందు పలు హిట్ సినిమాలకు ఇతను ఎడిటర్‌గా వర్క్ చేసాడు.
ఎస్.ఆర్. శేఖర్ పూర్తి పేరు.. ఎమ్.ఎస్. రాజ శేఖర్ రెడ్డి.. ఇతను తెలుగుదేశం పార్టీ గురించి, కమ్మ, కాపు కులాల గురించి దారుణమైన పదజాలం వాడుతూ ట్వీట్స్ చేసాడు. దీనిపై తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఫైర్ అవుతున్నారు.
కులాభిమానం ఉండొచ్చు కానీ ఇతర కులాల మీద ద్వేషం ఉండకూడదు.. సినిమా వాళ్లు ఇలా రాజకీయాలకు సంబంధించిన పోస్టులు చెయ్యకూడదు.. ఒక డైరెక్టర్ అయ్యిండి ఇలాంటి బాష వాడుతావా అంటూ ఫైర్ అవుతున్నారు.
డైరెక్టర్ మాత్రం ‘నాకే సంబంధం లేదు.. ఆ ట్వీట్స్ కానీ కులాల గురించి కామెంట్స్ కానీ నేను చెయ్యలేదు.. నన్ను వదిలెయ్యండి బాబోయ్’.. అంటున్నాడు. పైగా ‘నా అకౌంట్ వేరు, నేను చేసిన ట్వీట్స్ అని చెబుతున్న అకౌంట్ వేరు.. ఫొటోషాప్ చేసినతను సరిగా చెయ్యలేదు.. అది ఫేక్ ప్రొఫైల్’ అని అంటున్నాడు.
అసలు ఇది రియలా, ఫేకా అంటూ నెట్టింట పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తోంది. బాగా హర్ట్ అయిన ఫ్యాన్స్.. శేఖర్ పాత ట్వీట్స్ అన్నీ తీసి.. ఒక్కొక్కటిగా వివరంగా షేర్ చేస్తున్నారు. నాకు తెలియదు అని ట్వీట్ చేసిన శేఖర్ నిజం చెప్తాడో లేదో కానీ ఈ పరిణామంతో ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాకి మాత్రం గట్టి దెబ్బే పడుతుందంటున్నారు టాలీవుడ్ జనాలు..
Leave a comment