Hero: కోలీవుడ్, మాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలు తెలుగులో రీమేక్ లు చేస్తుంటారు స్టార్ హీరోలు. ఆల్ రెడీ ఓ కథను ప్రేక్షకులు ఒప్పుకుని హిట్ చేసిన సినిమాలు తెలుగులో తీస్తే అవి ఖచ్చితంగా సేఫ్ హిట్స్ అవుతాయని భావిస్తుందటారు. అలాగే ఈ కథను మన తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా, తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి మూవీస్ తీస్తారు. ఈ సినిమాల రీమేక్ లు చేయడంలో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్ లు ఎప్పుడు ముందుంటారు. ఇయర్ లో ఒక్క సినిమా అయినా అది రీమేక్ ఉంటుంది. అందుకే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వీరిని రీమేక్ హీరోలు అని కూడా అంటారు. బట్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం రీమేక్ చేయడానికి అస్సలు ఒప్పుకోరు. ఒరిజినల్ స్టోరీస్ ను మాత్రమే ఒప్పుకుంటారు.
ఒకసారి రీమేక్ సినిమాల్లో మీరు నటించరా అని మహేష్ బాబు ని అడగ్గా.. ఆ సినిమా అప్పటికే వేరే హీరో చేశారు కనుక ఆ పర్టిక్యులర్ సీన్ లో వాళ్లే కనిపిస్తారు. అక్కడ నా ఐడెంటిటీ.. నా స్టైల ఇవన్నీ ఎక్కడ ఉంటాయి. అందుకే నేను రీమేక్ సినిమాలకు ఓకే చెప్పను అని మహేష్ బాబు తన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చారు. టాలీవుడ్ లో ఉన్న మిగతా యంగ్ హీరోలు కూడా ఎక్కువగా ఒరిజినల్ స్టోరీలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీమేక్ లు చేయడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు. అందులోనూ మన టాలీవుడ్ లోనే చాలామంది యంగ్ డైరెక్టర్లు కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అందుకే యంగ్ హీరోలు కూడా కొత్త కథల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు.
అందుకే మన టాలీవుడ్ లో కూడా కొత్త స్టఫ్ సరికొత్తగా వస్తుంది. ఇక ప్రేక్షకులు కూడా కంటెంట్ ఉన్న స్టోరీస్ కు పట్టం కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో చిన్న సినిమాలు పెద్ద కలెక్షన్స్ ని దక్కించుకుని సక్సెస్ అయ్యాయి. చాలా చిన్న పాయింట్స్ ని ఎంతో నీట్ ప్రజంటేషన్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు.