Savitri: మహానటి సావిత్రి.. ఈతరం వారికి ఆమె గొప్పతనం తెలిసిందంటే అది కేవంల డైరెక్టర్ నాగ్ అశ్విన్ వల్లే అని చాలా స్ట్రాంగ్ గా చెప్పొచ్చు. సావిత్రి నుండి సావిత్రి గారు అని ఈతరం వారు కూడా ఆమెను గౌరవిస్తున్నారంటే అది కేవలం ఆమె గొప్పతనం. ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఆమె జీవితంలో అస్తమించింది. తన సినీ కెరీర్ లో ఎన్నో మెట్లు ఎక్కి ఉన్నత శిఖరాలకు చేరింది. ఆమె తన జీవితాన్ని ఎంత ఆనందంగా గడిపిన క్షణాలున్నాయో.. అంతకన్నా విచారంగా గడిపిన క్షణాలున్నాయి. తన కెరీర్ ను తనే చేతులారా నాశనం చేసుకున్నారు సావిత్రి గారు. తమిళంలో సావిత్రి ఆమె భర్త జెమిని గణేషన్ తో కలిసి యాక్ట్ చేసిన సినిమాలు చాలా వరకు ఫెయిల్ అయ్యాయి. ముఖ్యంగా వీరిద్దరు కలిసి సినిమాలకు ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టారు.
అదే టైమ్ లో జెమిని గణేషన్ కు వేరే నటితో అఫైర్ ఉండటం.. ఆ విషయం సావిత్రి గారికి తెలియడంతో తన జీవితంలో సునామి మొదలైంది. తన భర్త మీద ఉన్న కోపంతో ఎంత వద్దని చెప్పినా తన సొంత డబ్బుతో తెరకెక్కించిన చిన్నారి పాపలు అనే మూవీ తనను ఆర్థికంగా చితికిపోయేలా చేసింది. ఆమె సొంత బ్యానర్ లో వచ్చిన ఈ మూవీలో షావుకారు జానకి, జమున లాంటి స్టార్ హీరోయిన్స్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీగా రెమ్యునరేషన్స్, బడ్జెట్ ను ఫిక్స్ చేశారు. అయితే ముందుగానే అడ్వాన్సులు ఇచ్చేయడంతో నటీనటులు కూడా షూటింగ్ కు లేట్ గా రావడం.. ఈ సినిమా పూర్తి కాకుండానే సావిత్రి గారు వేరే సినిమాకు డేట్స్ ఇవ్వడం.. ఈ సినిమా బాధ్యతను వేరే వారిపై ఉంచడం ఇలా చేయడంతో చిన్నారి పాపలు సినిమా పూర్తి అవ్వడం చాలా లేట్ అయ్యింది.
దాంతో ఈ సినిమా సావిత్రి గారికి ఆర్థికంగా నష్టాల్ని తెచ్చిపెట్టింది. సరిగ్గా అదే టైమ్ లో సావిత్రిపై ఐటీ దాడులు కూడా జరిగాయి. ఇలా సావిత్రి గారు తన డైరెక్షన్ లో తీసిన చిన్నారి పాపలు సినిమాతో ఆమె ఆర్థికంగా, మానసికంగా కూడా కుంగిపోయింది. ఈ సినిమా స్టార్ట్ చేయకుండా ఉన్నా కూడా సావిత్రి గారు కాస్తలో కాస్త కోలుకునే వారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.