Lakshmi Pranathi: టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ లో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి జంట ఒకటి. వీరిద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు. ఎన్టీఆర్ భార్య అందరి హీరోల భార్యల మాదిరిగా పెద్దగా లైమ్ లైట్లో ఉండరు. సినిమా ఫంక్షన్స్‌కి రారు. అలానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండరు. అప్పుడప్పుడు ఎన్టీఆర్ మాత్రమే తన భార్యకి సంబంధించిన పిక్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. 2011లో లక్ష్మి ప్రణతిని పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పటికీ ఆమెతో ఎంతో ప్రేమగా ఉంటారు. ఈ దంపతులకి భార్గవ్ రామ్, అభయ్ రామ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లల ఆలనా పాలనా,భర్తకు సంబంధించిన విషయాలు చూసుకుంటూ ప్రణతి సంతోషంగా గడుపుతుంది.
ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి మధ్య బాండింగ్ ఎలా ఉంటుందనేది చాలా మందికి తెలియదు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే ఎన్టీఆర్ తన భార్యతో రొమాంటిక్‌గా ఉంటాడా, లేదంటే సీరియస్‌గా ఉంటాడా అనేది చాలా మందికి డౌన్. కాని ఎన్టీఆర్ తన భార్యతో చాలా రొమాంటిక్‌గా ఉంటాడని, వాళ్ళిద్దరి మధ్య పిలుపులు కూడా అంతే అందంగా ఉంటాయని తెలుస్తుంది. చూడడానికి సైలెంట్‌గా కనిపించే ప్రణతి చాలా జోక్స్ వేసి ఎన్టీఆర్‌ని తెగ నవ్వించేస్తుందట. ఎన్టీఆర్‌ని తన భార్య బావ అని పిలవడం ఇష్టంగా ఉండడంతో అలానే పిలిపించుకుంటాడట. ఒకవేళ ఎన్టీఆర్ కోపంలో ఉన్నా, చిరాకులో ఉన్నా కూడా ప్రణతి బావా అని పిలవడంతో ఇట్టే కరిగిపోతాడని ఆయనకు సంబంధించిన వారు చెప్పుకొస్తున్నారు.
అన్యోన్య దాంపత్యానికి సరదాలు, సంతోషాలు చాలా అవసరం. అవి వారి మధ్య చాలానే ఉన్నాయట. ఇక ఎన్టీఆర్.. తన భార్యని అమ్ములు అని ముద్దుగా పిలుచుకుంటాడు. ఇదెలా తెలిసిందంటే.. మార్చి 26న ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ ఓ ఫోటో షేర్ చేసిన ఎన్టీఆర్.. హ్యాపీ బర్త్ డే అమ్ములు అంటూ ట్యాగ్ లైన్ రాశారు. దీంతో ఎన్టీఆర్.. తన భార్యని అమ్ములు అని ముద్దుగా పిలుచుకుంటాడని అందరికి అర్ధమైంది.