NTR-Krishna: తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజాలలో ఎన్టీఆర్, ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు వారు తప్పక ఉంటారు. అయితే అప్పట్లో కృష్ణ, ఎన్టీఆర్ మధ్య పోటీ చాలా ఉండేది. కేవలం సినిమాలలోనే కాదు రాజకీయాలలోను వారిద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండేది. ఇద్దరు కూడా శత్రువులు మాదిరి ఉండేవారు. ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఉన్న సమయంలో కృష్ణ.. అన్నగారిని టార్గెట్ చేస్తూ పలు సినిమాలు చేశాడు. అప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా ఉండేది. అయితే నందమూరి తారకరామారావుకి కెరీర్ ప్రారంభం నుంచి అల్లూరి సీతారామరాజు సినిమా చేయాలన్న కోరిక ఎంతగానో ఉండేది. అప్పుడు రాజమండ్రి కి చెందిన పడాల రామారావుతో సీతారామరాజు సినిమాకు డైలాగులు కూడా రాయించారు ఎన్టీఆర్.
అప్పుడు కృష్ణకి ఈ విషయం తెలియడంతో వెంటనే రామచంద్రరావు అనే డైరెక్టర్ తో సినిమా మొదలు పెట్టేసారు. అయితే ఆ సినిమా మధ్యలో ఉండగానే రామచంద్రరావు కన్నుమూయడంతో మిగిలిన బ్యాలెన్స్ విజయనిర్మల పూర్తి చేశారు. ఇక ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమాని మహాభారతం ఆధారంగా చేశారు . ఈ సినిమా మొదలు పెట్టిన సమయంలో కృష్ణ ఈ సినిమాకు పోటీగా కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో కురుక్షేత్ర సినిమా తీశారు. అంతేకాదు దానవీరశూరకర్ణ సినిమా రిలీజ్ అయిన రోజునే తన కురుక్షేత్రం కూడా రిలీజ్ చేయించగా, కురుకేత్ర దారుణంగా నిరాశపరచింది. అన్నగారి సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది.
ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయనని పలుమార్లు ఎదుర్కొన్నారు. ఒకసారి ఎన్టీఆర్ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన మండల వ్యవస్థకు వ్యతిరేకంగా మండలాధీశుడు అనే సినిమా తీశారు కృష్ణ. ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్ర పోషించగా,ఆయన ఎన్టీఆర్‌ని కించపరిచేలా నటించడంతో అభిమానులు ఆయనపై దాడికి కూడా ప్రయత్నించారు. కోట ఈ విషయంలో ఎన్టీఆర్ అభిమానులకి క్షమాపణలు కూడా చెప్పాడు. ఇక ఎన్టీఆర్ గండిపేట కుటీరం నుంచి కార్యకర్తలు నిర్వహించే దానికి వ్యతిరేకంగా గండికోట రహస్యం అంటూ ఓ సినిమా తీశారు. చివరకు ఏలూరు ఎంపీగా టీడీపీ నుండి బుల్లి రామయ్య పోటీ చేయగా, అప్పుడు ప్రచారంలో బుల్లి రామయ్య నే కాదు పెద్ద రామయ్య అని కూడా ఓడిస్తానంటూ శపధం చేశారు కృష్ణ . అయితే కొన్నాళ్ల తర్వాత మాత్రం ఎన్టీఆర్-కృష్ణ ఇద్దరు కూడా చాలా సాన్నిహిత్యంతో మెలిగారు.