మన తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి దాదాపు అందరికి తెలిసిందే.. మరీ ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ ముందుకు దూసుకు వస్తున్నాడు చిరు.. హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. చిరంజీవి చివరగా గత సంవత్సరం భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం యంగ్ దర్శకుడు వశిష్ఠతో తన 156వ సినిమా చేస్తున్నడు. ఇదే సమయంలో ప్రస్తుతం చిరంజీవికి సంబంధించిన ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చిరంజీవి కెరీర్ లో ఆయన వ్యక్తిగత ఎదుగుదలకు తోడ్పడ్డ కొన్ని సినిమాలు చిరంజీవి పరువు తీసాయి.. ఓ సినిమా రెండుసార్లు సెన్సార్ కి వెళ్లి చిరంజీవి పరువును గంగపాలు చేసింది. ఆ సినిమా మరేదో కాదు.. చిరంజీవి హీరోగా విలక్షణ దర్శకుడు ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన అల్లుడాడా మజాకా. ఈ సినిమాలో చిరంజీవి హీరో అయితే రమ్యకృష్ణ- రంభ హీరోయిన్లగా నటించారు వీరి తల్లి పాత్రలో సీనియర్ నటి వాణిశ్రీని నటింపచేయాలని ముందుగా దర్శకుడు అనుకున్నారట.
ఆమెను కలిసి పాత్రను వివరించాడు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలో వాణి శ్రీ అత్తగా చిరంజీవి అల్లుడుగా నటించారు. మరోసారి అల్లుడా మజాకా చిత్రంలో వాణి శ్రీకి అత్త పాత్రలో నటించే అవకాశం లభించినా ఆమె తిరస్కరించారు. వాస్తవానికి చిరంజీవి, వాణిశ్రీ కలిసి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సూపర్ హిట్ మూవీలో నటించారు. నటిగా వాణిశ్రీకి ఈ సినిమా రీ ఎంట్రీ మూవీ. అత్త, అల్లుడు పాత్రలో చిరంజీవితో ఢీ అంటే ఢీ అనేవిధంగా వాణి శ్రీ నటించింది. ఓ రే**ప్ సీన్ లో నటించేటటువంటి సన్నివేశాలున్నాయి.
ఇక అవి నచ్చని వాణి శ్రీ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకోలేదు. అయితే ఆ తర్వాత దర్శక, నిర్మాతలు మరో నటి లక్ష్మీతో ఆ పాత్రను చేయించారు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలనే రిపీట్ చేయాలని ఈవీవీ సత్యనారాయణ, నిర్మాత దేవీ వరప్రసాద్ భావించినా వాణిశ్రీకి ఆమె పాత్ర నచ్చకపోవడంతో నటించలేదు. ఇక ఈ సినిమానికి పోసాని కృష్ణమురళి కథ, మాటలు అదించారు. అయితే చివరికీ ఈ సినిమా విషయంలో వాణి శ్రీ అంచనా కర్ట్ అయింది. ఎందుకు అంటే ఓ రేప్ సీన్ లో రమ్యకృష్ణ, రంభ, వాణిశ్రీలతో ఉండే సరదాగా సాగే ఆ సన్నివేశాలు ప్రేక్షకుల వినోదానికి కారణమయ్యాయి. అదేవిధంగా ఈ సినిమాలో అత్త పాత్రలో నటించిన లక్ష్మీ వేషధారణ కూడా అంతగా నచ్చలేదని కామెంట్లు కూడా వచ్చాయి. ఇక చివరికి రెండుసార్లు సెన్సార్ కి వెళ్లి కూడా ఈ సినిమా చిరంజీవి పరువు తీసిన మూవీ గా మిగిలిపోయింది.