హీరోయిన్లు కారణంగా ఫ్లాప్ అయిన చిరంజీవి సినిమా ఏమిటో తెలుసా..!? - Filmylooks
Home Film News హీరోయిన్లు కారణంగా ఫ్లాప్ అయిన చిరంజీవి సినిమా ఏమిటో తెలుసా..!?
Film News

హీరోయిన్లు కారణంగా ఫ్లాప్ అయిన చిరంజీవి సినిమా ఏమిటో తెలుసా..!?

చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు.. ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేసి సూపర్ హిట్ అందుకున్న సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాగే ఓ హీరోయిన్ చేయాల్సిన సినిమాను మరో హీరోయిన్ చేస్తే ప్లాప్‌ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎలాంటి అనుభవమే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సినిమాకు కూడా ఎదురైంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ నిర్మాణంలో వచ్చిన సినిమా కొదమసింహం.

Chiranjeevi: ఆ హీరోయిన్ కి తెలుగు నేర్పిన చిరంజీవి ! | megastar chiranjeevi teached telugu to those top actress

అయితే ఈ సినిమా కంటే ముందే చిరంజీవి కొండవీటి దొంగ అనే సినిమా చేసి మంచి బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. విజయశాంతి, రాధా హీరోయిన్లుగా నటించగా.. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ స్క్రీన్ ప్లే అందించగా. పరుచూరి బ్రదర్స్ కథని అందించారు. భారీ లాభాలను అందుకున్న ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అదేవిధంగా సీనియర్ దర్శ‌కుడు ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకి సమాంతరంగా కౌబాయ్ పాత్రలో చిరంజీవి కొదమసింహం సినిమాలో నటించాడు.

అయితే ఈ సినిమాకి కె. మురళీ మోహన్ రావు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కూడా హీరోయిన్స్ గా విజయశాంతి, రాధ నటించాల్సి ఉంది. కానీ ఈ సినిమాలో రాధ పోషించాల్సిన పాత్రలో వాణి విశ్వనాథ్ నటించింది. అయితే మెయిన్ హీరోయిన్ గా అనుకున్న విజయశాంతి ఆ సమయంలో ఎంతో బిజీగా ఉంది ఆమె ప్లేస్ లో సోనమ్‌ అనే కొత్త అమ్మాయిని తీసుకున్నారు. ఈ విధంగా ఈ సినిమాకు ముందు హీరోయిన్లుగా అనుకున్న రాధ‌, విజయశాంతి పాత్రలను వాణి విశ్వనాథ్, సోనమ్‌ చేయడంతో అదే ఈ సినిమాకి పెద్ద మైనస్స్ అయింది. హీరోయిన్లు తారుమారవడం వల్ల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

Kodama Simham Telugu Full Movie | Chiranjeevi | Radha, Sonam | Mohan Babu | Telugu Movie Studio - YouTube

మరి ముఖ్యంగా ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన సోన‌మ్‌ చిరంజీవి పక్కన ప్రేక్షకులు చూడలేకపోయారు. ఇక ఈ సినిమాకు రాజ్ కోటి అందించిన మ్యూజిక్ సాంగ్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకి ఈ సినిమా భారీ నష్టాలు తెచ్చిపెట్టిందని కూడాా చెప్పవచ్చు. ఇక చిరంజీవి కౌబాయ్ పాత్రలో ఆకట్టుకున్నప్పటికీ అప్పట్లో ఉన్న ఆడియన్స్ కి ఈ సినిమా ఎక్కలేదు. ఇక దీంతో కథ కంటే హీరోయిన్ మైనస్ అయి ఈ సినిమా ప్లాప్ ముద్రను ఆమె మీదకు తోసేశారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...