Heroes: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు తమ ఇమేజ్ ఇంకా డిమాండ్ కు తగ్గట్లుగా సినిమాల్లో నటిస్తూ కోట్ల రూపాయల్ని రెమ్యునరేషన్ గా తీసుకుని సోసైటీలో ఓ రేంజ్ ఇమేజ్ ని మెయింటైన్ చేస్తుంటారు. మరి ఇదే స్టార్ స్టాటస్ ఉన్న మన స్టార్ హీరోలు సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారు.. ఎలా ఉండేవారు.. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలని ఫ్యాన్స్ విపరీతమైన ఆత్రుత ఉంటుంది. ఇక హీరోలకు ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ తోనో లేదా వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటూనో ఇప్పుడు టాప్ రిచ్చెస్ట్ పర్సన్స్ గా ఉన్నారు. మరి మన హీరోలు సినిమాల్లోకి రాకముందు ఎవరు ఏం వర్క్ చేసేవారు.. ఏ బిజినెస్ లో ఉండేవారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ఈయన సినిమాల్లోకి రాకముందు ట్యూషన్ మాస్టర్ గా వర్క్ చేశారు. పెళ్లిచూపులు సినిమాతో తరుణ్ భాస్కర్ తనను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
అమితాబ్ బచ్చన్.. ఆయన సినిమాల్లోకి రాకముందు కోల్ కత్తాలోని ఒక పేరున్న షిప్పింగ్ యార్డ్ లో ఎగ్జిక్యూటర్ గా వర్క్ చేశారు. అలాగే బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ సినిమాల్లోకి రాకముందు ఓ కంపెనీలో అటెండర్ గా వర్క్ చేశారు. నెక్ట్స్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారారు. బట్ అల్లు అర్జున్ మూవీస్ లోకి వచ్చే ముందు యానిమేటర్ గా పనిచేశారు. కోలీవుడ్ లో తన కంటూ ఓ మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరోల్లో సూర్య కూడా ఒకరు. ఆయన సినిమాల్లోకి రాకముందు గవర్నమెంట్ ఆఫీస్ లో వర్క్ చేశారు. ఆల్ టైమ్ ఫేవరెట్ కమెడియన్ బ్రహ్మానందం సినిమాలోకి రాకముందు తెలుగు లెక్చరర్ గా పని చేశారు.
మోహన్ బాబు సినిమాల్లోకి రాకముందు వ్యాయామ టీచర్ గా వర్క్ చేశారు. నెక్ట్స్ హీరో గోపిచంద్ మూవీస్ లోకి రాకముందు ఓ టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్ గా వర్క్ చేశారు. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లోకి రాకముందు బస్ కండెక్టర్ గా ఉద్యోగం చేశారు. ఆయన ఆ స్థాయి నుండి ఈ స్థాయికి చేరుకున్నారు. ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు. నెక్ట్స్ ఆది పినిశెట్టి సినిమాల్లోకి రాకముందు క్రికెటర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేశారు. హీరో సుధీర్ బాబు మూవీస్ లోకి రాకముందు బ్యాడ్మింటన్ ఆడేవారు. అదీ సంగతి మరి ఇంకా ఏఏ హీరోలు సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి.