Aishwarya-Abhishek: బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ జంట తప్పక ఉంటారు. వీరి వైవాహిక జీవితానికి గుర్తుగా ఆరాధ్య అనే చిన్నారి జన్మించగా, ఆ చిన్నారిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. అయితే అభిషేక్ బచ్చన్ కన్నా ముందు ఐశ్వర్యరాయ్ పలువురితో ప్రేమలో ఉండగా, చివరికి అభిషేక్ బచ్చన్‌ని ఎలా పెళ్లి చేసుకుందని చాలా మందిలో అనుమానం ఉంటుంది. పలు సందర్భాలలో కొందరు నెటిజన్స్ అభిషేక్ బచ్చన్.. ఐశ్వర్యరాయ్‌కి తగ్గ వ్యక్తి కాదు అంటూ కూడా ట్రోల్స్ చేస్తుంటారు.వీటికి అభిషేక్ బచ్చన్ చాలా సున్నితంగానే స్పందిస్తూ ఉంటారు. అయితే తాను అమెరికన్ సింగర్ రాపర్‌కి పెద్ద అభిమానినని, నేటికీ తనకు ఇష్టమైన పాట రాపర్ నెల్లీ పాడిన ‘డైలమా’ పాట అని అభిషేక్ చెబుతూ ఉంటారు.
అయితే తాను ఐశ్వర్యరాయ్‌తో డేటింగ్లో ఉన్న సమయంలో ఆమె తన కోసం నెల్లీ ఆటోగ్రాఫ్ తీసుకువచ్చి తనని సర్ప్రైజ్ చేసిందని చెప్పాడు. అతి నిజంగా అదొక అద్భుతమని అభిషేక్ పేర్కొన్నాడు. 2007లో అభిషేక్, ఐశ్వర్య పెళ్లి చేసుకోగా, అతను తన కెరీర్ ప్రారంభ చిత్రాలలో మొదటిసారిగా ఐశ్వర్యతో కలిసి పని చేశాడు. తొలి సారి వారద్దరు ‘ధై అక్షర ప్రేమ్’లో కలిసి పనిచేశారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది రాను రాను మరింత బలపడి స్నేహం కన్నా ఎక్కువైందని అభిషేక్ ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చారు.
వయసు పెరిగే కొద్ది ఐశ్వర్యరాయ్ అందం క్రమక్రమంగా పెరుగుతోంది. సుమారు 19ఏళ్ల క్రితం మిస్ వరల్డ్ కిరిటాన్ని దక్కించుకున్నప్పుడు ఎంత అందంగా ఉందో, బిడ్డ పుట్టాక కూడా అదే అందంతో కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఐశ్వర్యరాయ్ వెండితెరపై మెరిసింది. మణిరత్నం పొన్నియ సెల్వం సినిమాలో తన మార్కు నటన ప్రదర్శించి అభిమానుల్నిఎంతగానో ఫిదా చేసింది. ఐశ్వర్యరాయ్ అందం చూసి ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధులయ్యారు. ఇక ఆమె భర్త అభిషేక్ బచ్చన్ విషయానికి వస్తే ఆయన అడపాదడపా సినిమాలు చేస్తుండగా, అవి పెద్దగా విజయం సాధించడం లేదు.