Does hero Naga Chaitanya have such expensive cars? Do you know their price?
Home Film News Naga Chaitanya: హీరో నాగ చైతన్య దగ్గర అంత ఖ‌రీదైన కార్లు ఉన్నాయా.. వీటి ధర ఎంతో తెలుసా
Film News

Naga Chaitanya: హీరో నాగ చైతన్య దగ్గర అంత ఖ‌రీదైన కార్లు ఉన్నాయా.. వీటి ధర ఎంతో తెలుసా

Naga Chaitanya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందులోనే యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రజంట్ తాను చేసే సినిమాలు హిట్టయినా.. ఫ్లాప్ అయినా.. ఎక్కడా ఆగకుండా వరుస ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. నాగచైతన్యకు సినిమాల తర్వాత కార్లు అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర ఇప్పటికే చాలా కార్లు, బైక్ లు కలెక్షన్ ఉంటుంది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాగచైతన్య దగ్గర కార్లు, బైక్ లు కూడా వేరేవరి దగ్గర లేవన్నది టాక్ కూడా. నాగచైతన్యకు తనను ఇష్టపడేవాళ్లు కొన్ని కార్లు, బైక్స్ ని కూడా ఫ్యామిలీ మెంబర్స్.. ఫ్రెండ్స్ ఇలా చాలామంది గిఫ్ట్స్ గా ఇచ్చేవాళ్లు.

ఇక నాగచైతన్య మాజీ భార్య సమంతతో కలిసి ఉన్నప్పుడు తన భర్త కోసం చాలా స్పెషల్ గా ఉండే కార్లను గిఫ్ట్ గా ఇచ్చింది. ఇక తన ఫేవరెట్ కార్లు మాత్రం నాగచైతన్య తానే కొనుక్కునేవాడు. మరి చాలామందికి చై దగ్గర ఉన్న కార్లు ఎలాంటివి.. ఏవి హై కాస్ట్ అనే డీటైల్స్ తెలుసుకోవాలనుకుంటారు కదా.. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. నాగచైతన్య దగ్గర ఫెరారీ కంపెనీకి చెందిన 488జిటిబి అనే కారు ఉంది. దీని కాస్ట్ అక్షరాల 3.88 కోట్లు. నాగచైతన్య దగ్గర అన్నీ కార్లల్లో కాస్ట్లీ కార్ ఇదే. నెక్ట్స్ బీఎండబ్ల్యూ 740 ఎల్ ఐ అని కారు కూడా నాగ చైతన్య దగ్గర ఉంది.

దీని ధర రూ. 1.30 కోట్లు. నిస్సాన్ జిటిఆర్ కారు ధర రూ. 2.12 కోట్లు. ల్యాండ్ రోవర్ కు చెందిన రేంజ్ రోవర్ వోగ్ కారు కూడా ఉంది. దీని ధర రూ.1.18 కోట్లు. మెర్సిడెస్ బెంజ్ జి క్లాస్ జి 63 ఏఎంజి కారు కూడా చైతన్య వాడుతున్నారు. దీని ఖరీదు రూ. 2.28 కోట్లు. ఎంవి ఆగస్టా ఎఫ్ 4 అనే బైకు కూడా చైతన్య దగ్గర ఉంది. దీని ధర రూ.35 లక్షలు. బీఎండబ్ల్యూ 9ఆర్ టి అనే బైక్ ధర రూ. 18.50 లక్షలు. ఈ కార్లు చైతు దగ్గర ఉన్నాయి. ఇక తన కార్లతో నాగచైతన్య అప్పుడప్పుడు ఆన్ రోడ్ కూడా వెళ్తారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...