Vedha Motion Poster: ‘కరునాడ చక్రవర్తి’, డా.శివ రాజ్ కుమార్ కెరీర్లో ప్రెస్టీజియస్ మైల్స్టోన్ చేరుకున్నారు. హీరోగా 125వ సినిమా కన్ఫమ్ చేశారు. ఎ.హర్ష డైరెక్ట్ చేస్తుండగా.. గీత పిక్చర్స్ బ్యానర్ మీద ఆయన సతీమణి గీత రాజ్ కుమార్ నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తోంది.
ఈ సినిమాకి ‘వేద’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘వేద’ పేరుకి ‘The Brutal 1960’s’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. శివ రాజ్ కుమార్ సరికొత్త లుక్‌లో కనిపించారు. విజువల్స్, ఆర్ఆర్ సాలిడ్‌గా ఉన్నాయి.
హై టెక్నికల్ వాల్యూస్‌తో, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. గానవి లక్ష్మణ్, ఉమశ్రీ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి సంగీతం : అర్జున్ జన్యా, కెమెరా : స్వామి జె.గౌడ.
Leave a comment