చాలా మంది హీరోలకి రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఇండస్ట్రీలో వాళ్ళ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోవడం చూస్తూ ఉంటాం. రామ్ చరణ్ ‘మగధీర’ తర్వాత, జూనియర్ ఎన్టీఆర్ ‘సింహాద్రి’ తర్వాత, రవితేజ ‘విక్రమార్కుడు’ తర్వాత పెద్ద హీరోలుగా మారడం జరిగింది. ఆ సినిమాలకి వచ్చిన రెస్పాన్స్ కూడా అలాంటిది. ఎలాగైనా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేసి పెద్ద స్టార్ గా మారిపోవాలి అనుకునే హీరోలు కూడా ఉంటారు.
అలాగని రాజమౌళితో చేస్తేనే ఎవరైనా పెద్ద హీరోలుగా మారతారని ఏం లేదు. ఉదాహరణకి మహేష్ బాబు ఇప్పటివరకు రాజమౌళితో సినిమా చేయకుండానే పెద్ద హీరోగా మారిపోయాడు. పవన్ కళ్యాణ్ కూడా రాజమౌలితో సినిమా చేయలేదు. కానీ ఇక్కడ ఈ ఇద్దరు పెద్ద స్టార్ లకి ఒక చిన్న తేడా ఉంది. అదే మహేష్ బాబు కమర్షియల్ గా బాగా హిట్లు కొడుతూ ఉండటం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తన అభిమానులని ఎంటర్టైన్ చేసే విషయంలో సక్సెస్ అవుతున్నా.. నిర్మాతలకి బాగా డబ్బులు రాబట్టడం వద్ద ఫెయిల్ అవుతున్నాడనే చెప్పాలి.
ఈ కాంటెక్స్ట్ లోనే చాలామంది పవన్ కళ్యాణ్ ని ఒకసారి రాజమౌళి డైరెక్షన్ లో చూడాలి అనుకుంటున్నారు. అలా చేస్తే పవన్ కళ్యాణ్ కేవలం అభిమానులని మాత్రమే కాక మిగతా అన్ని వర్గాలనీ, అవసరమైతే ఇతర భాషల వాళ్ళని కూడా పవన్ వైపు చూసేలా చేస్తుంది అనేది వాళ్ళ ఆలోచన. కానీ అది ఎప్పటినుంచో కలలాగానే మిగిలిపోతుంది. ఇప్పటికీ సాధ్యమయింది లేదు. కేవలం ఒకే ఒక్క సంధర్భంలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే సంధర్భం వచ్చింది అని చెప్తూ ఉంటారు.
అదే, రాజమౌళి తన విక్రమార్కుడు సినిమా స్క్రిప్ట్ తో పవన్ కళ్యాణ్ దగ్గరికి రావడం. కానీ, అప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమాలు చేసే ఆలోచనలో లేడట. మూవీస్ నుండి బ్రేక్ తీసుకోవాలనే ఆలోచనతో సినిమాలకి దూరంగా ఉన్న సమయంలో రాజమౌళి గారు ఆ కథతో ఆయన దగ్గరికి వెళ్ళడంతో పవన్ ఆ సినిమాని రిజెక్ట్ చేసాడట. ఒకవేళ ఆ సినిమా ఒప్పుకుని ఉండి ఉంటే, రాజమౌళి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ని చూడాలన్న కల ఎప్పుడో నెరవేరి ఉండేది. ప్రస్తుతం వీళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ ప్రాజెక్ట్స్ తో బిజీబిజీగా ఉన్నారు. ఎప్పటికైనా కలిసి పనిచేస్తారేమో చూద్దాం!
Leave a comment