Anasuya: యాంకర్‌గా, నటిగా సత్తా చాటుతున్న అనసూయ కొంత కాలంగా విజయ్ దేవరకొండపై దారుణమైన విమర్శలు చేస్తూ వార్తలలో నిలుస్తుంది. రీసెంట్గా విజయ్ దేవరకొండ నటించిన ‘ఖుషీ’ పోస్టర్ పై ‘ది విజయ్ దేవరకొండ’ అని ఉండటాన్ని ఆక్షేపించిన అనసూయ ఇన్‌డైరెక్ట్‌గా అతనిపై మండిపడింది. దీంతో విజయ్ ఫ్యాన్స్.. అనసూయ పై సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోల్స్ చేశారు. అయితే విజయ్ దేవరకొండ ఏం చేయకపోయిన కూడా ఎందుకు ఆమె ఇంతలా చేస్తుందని చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే అనసూయ.. విజయ్‌పై అంతలా ట్రోల్ చేయడం గురించి తాజాగా ఓ ఇంటర్యూలో తెలియజేసింది.
అనసూయ నటించిన తాజా చిత్రం విమానం. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే విమానం మూవీ ప్రమోషన్ లో భాగంగా అనసూయ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండతో తలెత్తిన విభేదాలపై మాట్లాడింది. తనకు కొంత మానసిక ప్రశాంతత కావాలని, అందుకే ఈ గొడవను ఇక్కడితో వదిలేద్దామని అనుకుంటున్నానని తెలియజేసింది. విజయ్ దేవరకొండ అభిమానులతో వార్ జరుగుతున్నప్పటి నుండి మానసిక ప్రశాంతత కోల్పోయినట్టు తాను పేర్కొంది. అయితే ఈ విషయాలన్నీ విజయ్ దేవరకొండకి తెలుసో లేదో నాకు తెలియదు కాని విజయ్ దేవరకొండకి క్లోజ్ గా ఉండే ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చి ఇలా తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయించాడని తెలిసింది.
ఈ వివాదంకి సంబంధించి తాను అలసిపోయానని.. ఇక్కడితో ఈ వివాదానికి ముగింపు పలకాలని భావిస్తున్నట్లు అనసూయ పేర్కొంది. విజయ్ గురించి గానీ, విజయ్ కి సంబంధించిన వారి గురించి గానీ ఇకపై మాట్లాడనని అనసూయ స్పష్టం చేసింది. విజయ్ దేవరకొండ తనకు ఎంతో కాలం నుంచి తెలుసునని, అయితే ఒకప్పుడు ఇద్దరం మంచి స్నేహితులమని పేర్కొంది. ఇక అనసూయ కొద్ది రోజులుగా విదేశాలకి ట్రిప్‌గా వెళ్లింది. అక్కడ బికినీలో ఈ అమ్మడు చేసిన రచ్చ సోషల్ మీడియాని షేక్ చేసింది. చాలా మంది అనసూయ తీరుని తప్పు పట్టారు. దారుణంగా ట్రోల్ చేశారు.