సినిమాలని ఇప్పుడు ఎక్కువగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ చేయడం జరుగుతోంది. సినిమాలని కొని వాటిని తమ ప్లాట్ ఫామ్స్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చూసే అవకాశం కల్పించడం జరుగుతుంది. ఐతే, ఇలా ఎక్కువ ధరకి కొన్న సినిమాలు తర్వాత బాగా లేవని తెలిస్తే వాటిని ఈ ప్లాట్ ఫామ్స్ కొన్నందుకు తీవ్రంగా నష్టపోతున్నాయి. అందుకే ముందుగానే తమకి మూవీ చూపిన తర్వాత మేం మా ప్లాట్ ఫామ్స్ లో వేసుకోవాలో వద్దో ఆలోచిస్తామని అవి అడుగుతున్నాయి.
సినిమాని ముందే చూపిస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి సినిమా నిర్మాతలు ఇలా రిలీజ్ కి ముందే సినిమా చూపించడానికి ఇష్టపడటం లేదు. సినిమాని కొన్న తర్వాత మీ ఇష్టం అని చెప్పేస్తున్నారు. ఇలా సక్సెస్ ఫుల్ గా చేయడం కోసం, సినిమా షూటింగ్ పూర్తవగానే ఆ సినిమాకి మంచి హైప్ తీసుకువస్తున్నారు. సో, ఓటీటీలకి ఏ సినిమాని కొనాలో, దేనిని కొనకూడదో ఒక అంచనాకి రావడం కష్టంగా మారింది.
ఐతే, ఈ తరహాలోనే ఈ మధ్యే వచ్చిన ధనుష్ సినిమా ‘జగమే తంత్రం’ సినిమా మేకర్స్ తెలివిగా తమ సినిమాని ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ కి 20 కోట్ల లాభానికి అమ్మేశారు. సినిమాని గుడ్డిగా కొనేసిన ఆ ప్లాట్ ఫామ్ వాళ్ళు తర్వాత ఆ మూవీ బాగా లేదని తెలుసుకుని ఇప్పుడు బాగా నష్టపోతున్నారు.
Leave a comment