Niharika: మెగా కుటుంబంలోఇటీవల వరుస విడాకులు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. శ్రీజ ఇద్దరు భర్తలకి విడాకులు ఇవ్వగా, నాగబాబు కుమార్తె నిహారిక కూడా తన వైవాహిక బంధానికి ముగింపు పలికిందంటూ కొన్నాళ్లుగా జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. అయితే ఇన్ని రోజుల వరకు దీనిపై ఎవరు స్పందించిది లేదు.ఎప్పుడైతే నిహారిక, చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం చేశారో .. అలానే తమ పెళ్లి ఫొటోలను సైతం చైతన్య ఇన్స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసాడో వీరి విడాకులపై నెటిజన్లలో అనుమానాలను రేకెత్తాయి.
ఆ మధ్య చైతన్య తన తల్లిదండ్రులతో కలిసి చైతన్య తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లగా,ఆ సమయంలో కూడా ఆయన వెంట నిహారిక లేదు. ఇక ఇటీవల జరిగిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుకలోనూ నిహారిక ఆమె భర్తతో కనిపించలేదు. ఇంటి అల్లుడు అయ్యి ఉండి బామ్మర్ది ఎంగేజ్మెంట్కు రాలేదంటే నిహారిక-చైతన్య జొన్నలగడ్డలు విడాకులు తీసుకొని ఉంటారని అందరు ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఈ అనుమానాలకి పులిస్టాప్ పడింది. జొన్నలగడ్డ వెంకట చైతన్య నుంచి తనకు విడాకులు కావాలని నిహారిక హైదరాబాద్‌లోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే హిందూ చట్ట ప్రకారం నిహారిక విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా.. గత నెల 5న కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది.
కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం నిహారిక, చైతన్యలు చేసిన దరఖాస్తు ఇప్పడు బయటకు రావడంతో వారిద్దరు విడాకులు తీసుకున్నట్టు కన్ఫాం అయింది. అయితే అసలు వారి విడాకులకి కారణం నిహారికనే అంటున్నారు. ఈ అమ్మడు అప్పుడు పబ్ ఇష్యూతో దొరకడం, ఆ తర్వాత అపార్ట్మెంట్ వారితో గొడవపడడం ప్రధాన కారణాలని ఇప్పుడు పలువురు చెప్పుకొస్తున్నారు. మరి ఈ ఇష్యూపై నాగబాబు ఏమైన స్పందిస్తాడా అన్నది చూడాలి. ఇక వెంకట చైతన్య జొన్నలగడ్డ .. నిహారికతో ఆగస్టు 13, 2020 నిశ్చితార్థం జరుపుకున్నాడు.. ఇక అదే ఏడాది డిసెంబర్ 9న రాజస్థాన్, ఉదయ్‌పూర్ కోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది బంధు మిత్రుల సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే.