డేటింగ్ అనేది ఇప్పుడు సినిమాల్లోనే కాదు.. మామూలు ప్రజల్లో కూడా సర్వ సాధారణ విషయం అన్నట్టు అయిపోయింది. నేరుగా పెళ్లి చేసుకుని తర్వాత ఒకరికి ఒకరు నచ్చకపోతే.. మళ్ళీ విడిపోయి.. మరో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో పడటం కంటే.. తొందరపడి పెళ్లి చేసుకోకముందే.. కలిసుండి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఆ తర్వాతే పెళ్లి చేసుకుని ముందుకు వెళ్ళాలా.. లేక విడిపోయి.. వేరొకరిని చూసుకోవాలా అని ఆలోచించడంలోనే న్యాయం ఉందని భావిస్తున్నారు చాలా మంది.
ఐతే, ఈ నిర్ణయాలు కొన్నిసార్లు.. అక్కడ దాకా రాకముందే ఒక దశను దాటుకుని ముందుకు వెలిపోతున్నాయి. పెళ్లి అవకుండానే.. వాళ్ళకి ఆ డేటింగ్ లో సంతోషంగా అనిపిస్తే.. ఇక అలాగే కంటిన్యూ అయిపోతున్నారు. దానికి ప్రత్యేకంగా పెళ్లి చేసుకుని.. కేవలం భార్యా భర్తలుగా చెలామణీ అవుతేనే పిల్లల్ని కనాలా అనే ఆలోచనలో పడిపోతున్నారు.
అచ్చంగా ఈ ధోరనితోనే ఈ మధ్య ఒక ఫేమస్ నటి వార్తల్లోకి వచ్చింది. ఆమెనే పాపులర్ మూవీ.. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా హీరోయిన్ ఫ్రిదా పింటో. ఆమె గత నాలుగేళ్లుగా కోరీ ట్రాన్ అనే వ్యక్తితో డేటింగ్ లో ఉంది. అతనితో డేటింగ్ లో ఉన్న తనకి ఇప్పుడు గర్భం అని తన సోషల్ మీడియా వేదికలో వెల్లడించింది. అతనితో కలిసి ఉన్న ఫోటోలని కూడా పోస్ట్ చేసింది. ఇప్పుడు వీళ్లిద్దరి స్టోరీ.. జనాలు ఇప్పటికే బాగా నమ్ముతున్న డేటింగ్ కల్చర్ ని మరింత ముందుకు తీసుకుపోయేలా చేస్తుందని అనుకోవచ్చు.
Leave a comment