విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన ఫన్ అండ్ ఫ్రస్ట్రరేషన్ మంచి హిట్లుగా మారిన విషయం తెలిసిందే. దాని సక్సెస్ తర్వాతనే మళ్ళీ ఇంకో భాగం చేసే ఆలోచనలో పడ్డారు సినిమా టీం. ఇప్పటిదాకా వాళ్ళు చేసిన రెండు పార్ట్స్ కి మరింత జోరుని కొనసాగించడానికి ఈ మూడో పార్ట్ ని కూడా తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
షూటింగ్ కూడా దాదాపు పూర్తి అవుతున్న సమయంలో సెకండ్ వేవ్ రావడం, షూటింగ్ ఆగిపోవడం జరిగాయి. ఇక అప్పటినుంచి మళ్ళీ సినిమాకు సంబంధించిన పనులు ముందుకు వెళ్లలేదు. కానీ.. లాక్ డౌన్ నిబంధనలు తీసివేసినప్పటినుంచి షూటింగ్ లు మెల్లగా తిరిగి మొదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా పనులు కూడా మొదలయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి వైరస్ బారిన పడటం కూడా ఒక కారణం అయింది. వెంకటేశ్ గారు నారప్ప షూటింగ్ కూడా ముగించుకుని ఉండడంతో ఇప్పుడు ఈ సినిమా పనులు వేగంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాని రాబోయే సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
Leave a comment