టీఆర్ఎస్ మంత్రి కల్వకుంట్ల తారకరామారావ్ గారు తనకు సోషల్ మీడియాలో కనిపించే టాలెంట్ ని ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో తనకు తెలిసిన సెలబ్రిటీలకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. నటించే వాళ్ళు, పాటలు పాడే వాళ్ళు ఇలా ఎవరు కనిపించినా వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేసే ప్రయత్నం చేస్తారు. అలా ఈ మధ్య మంత్రి గారు.. మెదక్ జిల్లాలోని ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన అమ్మాయిని దేవిశ్రీ ప్రసాద్ కి టాగ్ చేస్తూ.. తనకి ఏదైనా అవకాశం ఇప్పించగలరా అని అడిగారు.
ఆ రిక్వెస్ట్ కి ఓకే చెప్పిన దేవిశ్రీ ఆ అమ్మాయిని కలుసుకుని.. తనని ఒక టీవీ షోలో పాడించాడు. ఆ షో కూడా స్వయంగా దేవిశ్రీ ప్రసాద్ దే కావడం విశేషం. శ్రావణి అనే ఆ అమ్మాయి.. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నట్లు కనిపించింది. చాలా సంతోషంగా పాడుతున్న ఆ అమ్మాయి ఈ ఆదివారం సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు ప్రసారం కాబోతుంది.
ఐతే, దేవిశ్రీ స్పందించిన తర్వాత ‘Great Gesture Brother’ అని కొనియాడారు కేటీఆర్. ఇది చూసిన నెటిజన్స్ కూడా ఈ టాపిక్ ని బాగా వైరల్ చేసేస్తున్నారు. ఒక విలేజ్ కి చెందిన అమ్మాయిని.. లైమ్ లైట్ లోకి తీసుకొచ్చి అవకాశం ఇచ్చిన తీరు అందరినీ సంతోషింపజేస్తుంది. Star To Rockstar పేరుతో ప్రసారమయ్యే ఈ ప్రోగ్రామ్ కి కూడా మంచి స్పందన వస్తుంది.
Leave a comment