ప్రశాంత్ వర్మ జాంబీ రెడ్డి సినిమా సక్సెస్ తో ఉత్సాహంగా ఉన్నాడు. ఈ సినిమా అతనికి డైరెక్టర్ గా మరింత గుర్తింపునిచ్చింది. క్రియేటివ్ గా సినిమాలు తీస్తున్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు మరో వినూత్న ప్రయత్నాంతో ప్రేక్షకులకు ఆనందాన్ని పంచబోతున్నాడు.
సూపర్ హీరో కథలంటే ఇప్పటిదాకా పూర్తిగా కల్పితంగా ఉండటం చూశాం. కానీ మొదటిసారి నిజంగా జరిగిన రామాయణంలో హనుమాన్ పాత్రతో సినిమా తీసే ఆలోచనలో పడ్డాడు దర్శకుడు. ఈ సినిమాకి సంబంధించి ఈ రోజే పూజా కార్యక్రమం కూడా నిర్వహించారు. సి. కళ్యాణ్ క్లాప్ బోర్డ్ కొట్టగా, ఫస్ట్ షాట్ ని శివ శక్తి దత్త గౌరవ ప్రదంగా షూట్ చేశారు. సినిమా షూటింగ్ మరి కొన్ని రోజుల్లో ముందుకు తీసుకెళ్లబోతున్నారు.
తేజ సజ్జ ఈ సినిమాలో ప్రధాన పాత్రగా కనిపించబోతున్నాడు. సినిమాని నిర్మిస్తున్న వాళ్ళు కె. నిరంజన్ రెడ్డి. అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తారు. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ చేయబోతున్నారు.
Leave a comment