ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీలో మారు మ్రోగుతున్న పేరు.. సిల్వర్ స్క్రీన్ మీద ఇంతకుముందెన్నడూ చూడని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌ని అత్యద్భుతంగా ఆవిష్కరించి యావత్ ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ప్రశాంత్.
కె.జి.యఫ్ చాప్టర్ 1 తో సెన్సేషన్ క్రియేట్ చేసి, పార్ట్ 2తో పిచ్చెక్కించేశారు. ఎలివేషన్ షాట్స్ తియ్యడంలో PHD చేసాడా ఏంటి.. అని ఫిలిం మేకర్స్ సైతం ఆశ్చర్యపోయేలా, ఆడియన్స్‌కి గూస్ బంప్స్ తెప్పించేలా థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేశారు. తర్వాత రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో, ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమాలు చేస్తున్నారు.

నేడు (జూన్ 4) ప్రశాంత్ పుట్టినరోజు.. ఈ ఏడాదితో ఆయన 42వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ప్రశాంత్ అతికొద్ది సమక్షంలో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. ‘రాకింగ్ స్టార్’ యష్, ‘రెబల్ స్టార్’ ప్రభాస్, నిర్మాత విజయ్ కిరగందూర్ తదితరులు పార్టీలో పాల్గొని ప్రశాంత్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

తారక్ ఫ్యామిలీతో వెకేషన్లో ఉండడంతో వీలు పడలేదు. ప్రస్తుతం ‘సలార్’ షూటింగ్ దశలో ఉంది. ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా NTR 31 అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ ఫిలిం వచ్చే ఏడాది సెట్స్ మీదకి వెళ్లబోతుంది.

Leave a comment